ముఖ్యమంత్రి జగన్ కుటుంబంపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు(objectionable social media posts) పెట్టారన్న ఆరోపణపై తెనాలికి చెందిన తెదేపా మహిళా నేత బొలినేని జ్యోతిశ్రీ(cid enquiry on jyothisree)ని సీఐడీ అధికారులు మళ్లీ విచారణకు పిలిపించారు. ఇప్పటికే ఈ కేసులో ఆమె అరెస్టు కాగా.. మరోసారి విచారణకు హాజరుకావాలని సీఐడీ(cid) అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు జ్యోతిశ్రీని సుమారు 3 గంటలపాటు గుంటూరు(guntur) ప్రాంతీయ సీఐడీ కార్యాలయంలో విచారణ చేపట్టారు.
సీఐడీపై గౌరవంతో విచారణకు హాజరయ్యానని.. ఇన్నిసార్లు విచారణ పేరుతో పిలవడం సరైన పద్ధతి కాదని జ్యోతిశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పై అధికారుల ఒత్తిడితోనే తనను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. నా ఆరోగ్యం బాగాలేకపోయినా మూడోసారి విచారణకు పిలిచారని జ్యోతిశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి..