అమెజాన్ బంపర్ డ్రాలో మీరు లక్కీ విన్నర్‌గా(cheating in name of lucky winner of car) ఎంపికయ్యారు.. రూ. 10 లక్షల విలువ చేసే కారు సొంత చేసుకున్నారంటూ.. సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసానికి పాల్పడ్డారు. కానీ.. కారు మీకు పంపించాలంటే టాక్స్ చెల్లిస్తే సరిపోతుందని మాయ మాటలు చెప్పి రూ. 30 వేలు దోచుకున్న ఘటన గుంటూరులో చోటుచేసుకున్నారు. బాధితురాలు గుంటూరు అరండల్ పేట పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
గుంటూరు ద్వారకా నగర్‌కు చెందిన ఓ మహిళకు పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి మీరు లక్కీ విన్నర్‌గా ఎంపికయ్యారు.. బంపర్ డ్రాలో మీరు 10 లక్షల విలువ చేసే కారు గెలుపొందారంటూ మాయ మాటలు చెప్పారు. కారును పంపించడానికి ముందుగా రూ. 30 వేలు టాక్స్ కట్టాల్సి ఉంటుందని ఆమెను నమ్మించారు. వారి మాటలు నిజమే అని నమ్మిన భాదితురాలు నిందితులు ఇచ్చిన అకౌంట్ నెంబరుకు రూ. 29,960.. తన ఎస్బీఐ ఖాతా నుంచి బదిలీ చేశారు. డబ్బు పంపిన తరువాత నిందితుల ఫోన్ నంబరు స్విచ్ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించింది.
ఇదీ చదవండి:
Amravati Farmers: 'ముఖ్యమంత్రి దిగొచ్చే వరకు ఉద్యమం చేస్తాం'