చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు పైసా కూడా చెల్లించలేదని... పైగా ఆ సంస్థ భూములను కారుచౌకగా కొట్టేసే ప్రయత్నం చేశారని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు పరిహారం అందిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న మాటలు దారుణంగా ఉన్నాయని అన్నారు. డీజీపీని కూడా ఇష్టారాజ్యంగా విమర్శించటం సరికాదని అభిప్రాయపడ్డారు. ఖాకీ చొక్కా విడిచి పచ్చ చొక్కా వేసుకున్న వాళ్లకే తెదేపా ప్రభుత్వంలో మంచి పోస్టులు ఇచ్చారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని... అధికార పార్టీ నేతలు తప్పు చేసినా వదిలిపెట్టొద్దని సీఎం జగన్ ఆదేశించినట్లు చెప్పారు. తెదేపా ప్రభుత్వంలో వైకాపా నేతలపై దాడులు జరిగితే కనీసం స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితి కూడా లేదన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి వీడియో గేమ్స్ ఆడుతున్నారని చంద్రబాబు నాయుడు చెప్పటం సరికాదని సుచరిత అన్నారు. ఆయన మానసిక స్థితిపై వైద్య పరీక్షలు చేయించాలని ఆయన కుటుంబ సభ్యులకు సూచిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇటీవల జాతీయ మానవహక్కుల కమిషన్ బృందం గుంటూరు జిల్లాలో పర్యటించి అంతా సవ్యంగానే ఉన్నట్లు నివేదిక ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే నివేదిక బయటపెడతామన్నారు.
చంద్రబాబుకి వైద్య పరీక్షలు చేయించాలి: సుచరిత - చంద్రబాబుపై సుచరిత విమర్శలు వార్తలు
చంద్రబాబు నాయుడిపై హోం మంత్రి సుచరిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన మానసిక స్థితిపై వైద్య పరీక్షలు చేయించాలని వ్యాఖ్యానించారు. పచ్చ చొక్కా కప్పుకున్న పోలీసులకే తెదేపా హయాంలో మంచి పదవులు దక్కాయని ఆరోపించారు.
![చంద్రబాబుకి వైద్య పరీక్షలు చేయించాలి: సుచరిత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5006439-68-5006439-1573237473683.jpg?imwidth=3840)