Somu Veerraju: వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తే యూ1 జోన్ రద్దు దస్త్రం పైనే తొలి సంతకం చేస్తామని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో యూ1 జోన్ ఎత్తివేయాలంటూ 15 రోజులుగా.. రైతులు చేస్తున్న నిరాహార దీక్షకు సోము వీర్రాజు మద్దతు పలికారు. రైతులతో కలిసి దీక్షలో పాల్గొన్న ఆయన... వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Conflict between Womens: స్థల వివాదం.. రోడ్డుపైనే కొట్టుకున్న మహిళలు