భారత ఆర్మీలో ప్రవేశాలకు ఈనెల 15 నుంచి 30వ తేది వరకు గుంటూరులో నియామకాలు నిర్వహించనున్నట్టు రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ కోహ్లి తెలిపారు. కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగే ఈ నియమాకాలకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూరు జిల్లాలకు చెందిన వారు హాజరు కావచ్చని వెల్లడించారు. ఈ నియామకాల కోసం వేలాది మంది వస్తున్నందున.. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ నియామకాలు ఏప్రిల్లో జరగాల్సి ఉన్నా... కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డాయి. ఈ నియామకాల ద్వారా సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్ మెన్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. WWW.JOININDIANARMY.NIC.IN వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని కల్నల్ కోహ్లి తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబిజాను ఆగష్టు 1న వెబ్సైట్లో ప్రకటిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:
AMARAVATI: ఎమ్మెల్యే శ్రీదేవికి నిరసన సెగ.. రాజీనామా చేయాలని రైతుల డిమాండ్