ETV Bharat / city

రాష్ట్రంలో ఒక్క నెలలోనే రూ.14,136 కోట్ల రెవెన్యూ లోటు - ఏపీ ప్రభుత్వ అప్పులు వార్తలు

లాక్‌డౌన్‌వల్ల అన్ని రకాల వసూళ్లు మందగించటంతో నూతన ఆర్థిక సంవత్సరంలో తొలి నెల ఏప్రిల్​లోనే భారీగా రెవెన్యూ లోటు ఏర్పడింది. రెవెన్యూ వసూళ్లు కేవలం రూ7,221.92 కోట్లకే పరిమితమవ్వగా... ఖర్చులు మాత్రం రూ.24,113.59 కోట్ల మేర ఉన్నాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ అకౌంట్స్‌ విభాగం లెక్కలు చెబుతున్నాయి.

ap Revenue deficit
ap Revenue deficit
author img

By

Published : Jul 24, 2020, 7:25 AM IST

రాష్ట్రంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి నెల ఏప్రిల్‌లోనే ఏకంగా రూ.14,136 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. ఆ నెలలో రెవెన్యూ ఖర్చు రూ.21,358.17 కోట్లు కాగా రెవెన్యూ వసూళ్లు కేవలం రూ7,221.92 కోట్లకే పరిమితమయ్యాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ అకౌంట్స్‌ విభాగం లెక్కలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌వల్ల అన్ని రకాల వసూళ్లు మందగించాయి. ఖర్చులు మాత్రం రూ.24,113.59 కోట్ల మేర ఉన్నాయి. ఇందులో రుణాలు, తదితరాల రూపంలో తీసుకొచ్చింది ఏకంగా రూ.16,903.47 కోట్లు.

  • కేంద్రం ఇచ్చింది రూ.4097 కోట్లు

మొత్తం ఆదాయంలో రెవెన్యూ వసూళ్లు రూ7221.92 కోట్లు కాగా కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చిన నిధులు రూ.4097 కోట్లు. మొత్తం అప్పులతో సహా అన్ని రూపాల్లో వచ్చిన ఆదాయమూ కలిపి రూ.24,113.59 కోట్లను ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఏప్రిల్‌ నెలకు జీతాలు, పెన్షన్లు సగం మొత్తమే చెల్లించినా జీతాలకు రూ.3,624.27 కోట్లు, పెన్షన్లకు రూ.1,251.32 కోట్లు ఖర్చు చేశారు.

  • తొలి నెలలోనే రుణ భారం

ఏప్రిల్‌లో ఏకంగా ద్రవ్యలోటును సర్దుబాటు చేసుకునేందుకు రూ.16,903 కోట్ల రుణాలు, ఇతర లయబిలిటీల రూపంలో సేకరించాల్సి వచ్చింది. గతేడాది పరిస్థితితో పోల్చి చూసినప్పుడు ఇది చాలా ఎక్కువ. కిందటి ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రూ.52,090.63 కోట్లు ఈ రూపంలో ప్రభుత్వం సమీకరించగా ప్రస్తుతం అందులో నాలుగో వంతుకుపైగా మొత్తం తొలి నెలలోనే తీసుకోవాల్సి రావడం గమనార్హం. కిందటి ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలంలో రూ.16,706.05 కోట్లను రుణాల రూపంలో సమీకరించగా.. ఇప్పుడు తొలి నెలలోనే అంతకన్నా ఎక్కువ మొత్తం సమకూర్చాల్సి వచ్చింది.

ఇదీ చదవండి

రైతులు ఇచ్చిన భూముల్లో అమ్మకానికి 1600 ఎకరాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.