గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ వైకాపా అదనపు ఇంఛార్జ్‌గా నియమితులైన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కార్యకలాపాలను వేగవతం చేశారు. గుంటూరులో కార్యాలయాన్ని ప్రారంభించారు. మంత్రి అంబటి రాంబాబు, పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యాలయ ప్రారంభం అనంతరం మంత్రి అంబటి మాట్లాడారు. ఎమ్మెల్సీతో పాటు అదనపు ఇంఛార్జ్ పదవికి డొక్కా న్యాయం చేయగలరని అభిప్రాయపడ్డారు. డొక్కా గతంలో రెండుసార్లు తాడికొండ ఎమ్మెల్యేగా పని చేశారని.. భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని ఆకాంక్షించారు. 2024 ఎన్నికల్లో డొక్కా క్రియాశీలకమని, తాడికొండ ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉంటాయని చెప్పటం ద్వారా ఆయనే అభ్యర్థి అని పరోక్షంగా ప్రకటించారు.
డొక్కా మాట్లాడుతూ.. తాడికొండ అదనపు సమన్వయకర్తగా నియమించినందుకు పార్టీ అధినేత జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉండవల్లి శ్రీదేవి నాయకత్వాన్ని బలపరూస్తూ జగన్మోహన్ రెడ్డి పథకాల్ని ప్రజ్లలోకి తీసుకెళ్తామని తెలిపారు. 2024లో పార్టీ విజయానికి సమన్వయంతో పని చేస్తామని డొక్కా స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: