ప్లవ నామ సంవత్సరంలోనైనా ముఖ్యమంత్రి జగన్ మనస్సు మారాలని.. రాజధాని రైతులు దీక్షా శిబిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పురస్కరించుకొని దీక్షా శిబిరాలలో పంచాంగ శ్రవణం చేశారు. నూతన సంవత్సరంలో రైతుల కోరికలు ఫలిస్తాయని పంచాంగకర్త తెలిపారు. తుళ్లూరులో రైతులు, మహిళలు హనుమాన్ పారాయాణం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ వైఖరి వల్ల రోడ్డుపైనే పండుగ చేసుకుంటున్నామని రైతులు వాపోయారు. వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, అనంతవరం, ఉద్ధండరాయునిపాలెంలో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.