ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు 137వ రోజు ఆందోళనలు కొనసాగించారు. పగలు, రాత్రి తేడా లేకుండా రైతులు, మహిళలు భౌతిక దూరం పాటిస్తూ నిరసన చేపట్టారు. అమరావతి వెలుగు పేరుతో తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, బోరుపాలెం, రాయపూడిలో రైతులు, మహిళలు, చిన్నారులు కొవ్వొత్తులతో నిరసనలు తెలిపారు. కరోనా దేశం నుంచి విడిచిపోవాలని ఆకాంక్షించారు. పూర్తిస్థాయి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి..