పొరుగు నుంచి రాష్ట్రంలోకి మద్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచి, కల్తీ చేస్తున్న 500 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేశారు. అదే ఇంట్లో పేకాట ఆడుతున్న ఐదుగురినీ అరెస్టు చేశారు. వీరి నుంచి 40 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్లలో.. నల్గొండ జిల్లా తిప్పర్తి నుంచి అక్రమంగా తరలిస్తున్న 1360 సీసాల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. పాల లారీ, కారును సీజ్ చేశారు.
ఇదీ చదవండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం