మే 3 వరకూ దేశవ్యాప్త లాక్డౌన్ పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్వాగతించారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమని ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు చెప్పారు. తెదేపా పొలిట్ బ్యూరో ఇప్పటికే ఈ దిశగా తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని, కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గుంటూరులోని తన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి: