ETV Bharat / city

10 new varieties of pulses: కొత్త వంగడం.. అధిక పోషకం - గుంటూరు జిల్లా తాజా వార్తలు

10 new varieties of pulses: అధిక పోషక విలువలు కలిగిన కొత్త వంగడాలు వచ్చేశాయి. చిరుధాన్యాలు, వరి, మినుము, పెసరలో 10 రకాల వంగడాలను ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ విడుదల చేసింది. ఇవి యంత్ర కోతకు అనువైనవే కావడం విశేషం.

varieties of pulses
కొత్త వంగడం
author img

By

Published : Aug 31, 2022, 8:37 AM IST

10 new varieties of pulses: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ ప్రాంతీయ పరిశోధనా స్థానాల్లో చిరుధాన్యాలు, వరి, మినుము, పెసరలో రూపొందించిన 10 రకాల వంగడాలను మంగళవారం విడుదల చేశారు. వీటిని ఆరేళ్లకు పైగా సాగు చేయించి ఫలితాలు రాబట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వరిలో వారం నుంచి నెల రోజుల వరకు ముంపును తట్టుకునే రకాలు ఇందులో ఉన్నాయి. ఇప్పటి వరకు రైతులు సాగు చేస్తున్న రకాలతో పోలిస్తే అధిక పోషకాలు లభిస్తాయి. యంత్రాలతో కోతలకు అనువైనవని తెలిపారు. ఈ మేరకు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో రాష్ట్ర విత్తన సబ్‌ కమిటీ 40వ సమావేశం నిర్వహించారు. ఇందులో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ సి.హరికిరణ్‌, వర్సిటీ ఉప కులపతి విష్ణువర్ధన్‌రెడ్డి, డీఆర్‌ ఎల్‌.ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఇవీ వంగడాల రకాలు...

* రాగుల్లో 49.7% ఇనుము, 81.6% జింకు అధికం: విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన రాగి వీఆర్‌1099 (గోస్తనీ) రకం అన్ని జిల్లాల్లో సాగుకు అనువైనది. అగ్గి తెగులును తట్టుకుంటుంది. ప్రస్తుతం వాడుతున్న శ్రీచైతన్య రకం ఎకరాకు 11.2 క్వింటాళ్లు వస్తోంది. కొత్త వంగడం 14 క్వింటాళ్ల వరకు లభిస్తుంది. ప్రస్తుత రకాల కంటే ఇనుము 49.7%, జింకు 81.6% అధికంగా ఉంటుంది. గర్భిణులు, పోషకలోపం ఉన్న వారికి ఇది మెరుగైనది.

* కొర్రలో... 20% అధిక ప్రొటీన్‌, క్యాల్షియం: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రూపొందించిన కొర్ర ఎస్‌ఐఏ3159 (మహానంది) రకం ఖరీఫ్‌, రబీ సాగుకు అనువుగా ఉంటుంది. ఎకరాకు 12.4 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. సాధారణ రకాల కంటే 20% అధికంగా ప్రొటీన్‌, క్యాల్షియం ఉంటుంది.

* అగ్గితెగులును, నెల రోజుల ముంపునూ తట్టుకునే వరి: మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో అభివృద్ధి చేసిన ఎంటీయూ1232 వరి రకం నెల రోజుల ముంపును తట్టుకుంటుంది. 135 నుంచి 140 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. అగ్గి, పాముపొడ తెగులు, సూదిదోమను తట్టుకునే శక్తి ఉంటుంది.

* వారంపాటు ముంపు తట్టుకునే వరి: మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రూపొందించిన ఎంటీయూ1318 వరి వంగడాన్ని ఎంటీయూ7029 స్వర్ణ రకానికి బదులుగా సాగు చేసుకోవచ్చు. యంత్రాలతో కోతకు అనువైనది. ఏడు రోజులు నీటి ముంపు కూడా తట్టుకునే శక్తి ఉంది. ఎక్కువ దిగుబడి ఇస్తుంది.

* ఉప్పు నేలలకు అనుకూలం: మచిలీపట్నం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఎంసీఎం103 బందరు సన్నాల రకాన్ని రూపొందించారు. ఉప్పు నేలలకు అనువైనది. అగ్గితెగులును తట్టుకుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఎకరాకు 24 నుంచి 26 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఉప్పు నేలల్లో ఎకరాకు 20 క్వింటాళ్ల నుంచి 22 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

* మొజాయిక్‌ వైరస్‌ తట్టుకునే మినుము: లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం రూపొందించిన ఎల్‌బీజీ884 మినుము రకం మొజాయిక్‌ వైరస్‌ను తట్టుకుంటుంది. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మాగాణి, మెట్ట ప్రాంతాలకు అనువైనదిగా గుర్తించారు.

* యంత్రంతో కోతకు అనువైన పెసర: లాం వ్యవసాయ పరిశోధనాస్థానంలో అభివృద్ధి చేసిన ఎల్‌జీజీ574(లాం574) పెసర రకం... మొజాయిక్‌ వైరస్‌ను తట్టుకుంటుంది. ఎకరాకు 6 నుంచి 6.4 క్వింటాళ్లు వస్తుంది. యంత్రంతో కోతకు అనువుగా ఉంటుంది. మాగాణి, మెట్ట ప్రాంతాల్లో సాగుకు అనుకూలం.

* 100 గ్రాముల కాయల్లో 72 గ్రాముల వేరుసెనగ పప్పు: తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానంలో రూపొందించిన టీసీజీఎస్‌1694 వేరుసెనగ రకం ఖరీఫ్‌, రబీ సాగుకు అనువైనది. ఎకరాకు ఖరీఫ్‌లో 14 క్వింటాళ్లు, రబీలో 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వంద గ్రాముల కాయల నుంచి 72 గ్రాముల పప్పు లభిస్తుంది.

* సెనగలో.. 20.9% అధిక ప్రొటీన్‌: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం రూపొందించిన ఎన్‌బీఈజీ776 పెసర వంగడం ఎండుతెగులును తట్టుకుంటుంది. ఎకరాకు 11.2 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఎక్కువ కాయలతో 20.9% ప్రొటీన్‌ కలిగి ఉంటుంది. జేజీ11 రకానికి బదులుగా సాగుకు అనువైనది. కాలపరిమితి 90-105 రోజులు ఉంటుంది. యంత్రాలతో కోతకు అనువైనదిగా గుర్తించారు.

* అన్ని కాలాల్లో సాగుకు అనువైన పెసర: లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో రూపొందించిన ఎల్‌జీజీ 607 (లాం పెసర607) పెసర రకం ఇది. 60 నుంచి 65 రోజుల కాలపరిమితి ఉంటుంది. మొజాయిక్‌ వైరస్‌ను తట్టుకుంటుంది. ఎకరాకు 6 నుంచి 6.8 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుంది. ఒకేసారి కోతకు వస్తుంది. యంత్రాలతో కోయించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.