Viral Video : బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షుడు పరాశ రంగనాథానికి ఓ మహిళ దేహశుద్ధి చేసింది. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో మహిళలకు మాయమాటలు చెప్పి నగదు తీసుకోవడంతోపాటు, నమ్మించి మోసం చేశాడని కొంతమంది మహిళలు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజాగా.. రంగనాథం ఆగడాలు భరించలేని ఓ మహిళ.. రెండు రోజుల క్రితం రంగనాథ్‌పై దాడికి పాల్పడింది. అధిక వడ్డీ ఇస్తానంటూ రూ.15 లక్షలు తీసుకున్నాడని పేర్కొంది. ఆ డబ్బులు ఇవ్వకపోగా తన గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాడంటూ.. భర్తతో కలిసి రంగనాథానికి దేహశుద్ధి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దృశ్యాలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదీ చదవండి: