అంతుచిక్కని వ్యాధితో ఏలూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 465 మంది బాధితులు ఆసుపత్రిలో చేరారు. వ్యాధి గురించి తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ఏలూరు చేరుకుంది. మంగళవారం నగరంలో పర్యటించి నమూనాలు సేకరించనుంది. కొందరు బాధితులతో డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు మాట్లాడనున్నారు.
ఇప్పటికే ఏలూరులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధికారులు పర్యటిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో తిరిగి ఆహార నమూనాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: అంతుచిక్కని వ్యాధి...అంతకంతకూ పెరుగుతున్న ఆందోళన