పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మాదివాడలో ఇంటిపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కోడలి కుటుంబ సభ్యులతో మనస్పర్థల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు నలుగురు కారణమంటూ నాగమణి అనే మహిళ ఫోన్‌లో ఆడియో రికార్డు చేసింది.
అనంతరం ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి : Sexual assualt: ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం