Variety Wedding Cards: వివాహ వేడుకల్లో.. శుభలేఖ ప్రాముఖ్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివిధ రూపాల్లో అందంగా అచ్చువేయించి మరీ శుభలేఖలు పంచుతుంటారు. కానీ.. బంధువులకు ఎంత మంచి శుభలేఖ ఇచ్చినా ఒకసారి చూసి వదిలేస్తుంటారు. అందుకే.. అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన విల్లూరి నూక నర్సింగరావు మాత్రం తన కుమారుడి పెళ్లి పత్రికను ఎప్పటికీ గుర్తుంచుకునేలా అచ్చు వేయించాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే వినూత్న రీతిలో శుభలేఖలను అచ్చు వేయించారు.
ఏకంగా.. ఒక నోట్ బుక్ తరహాలో శుభలేఖను ముద్రించారు. ముందు భాగంలో వధూవరుల ఫొటోలతో పెళ్లి వివరాలు తెలియజేసి, మధ్యలో పుస్తకం మాదిరిగా 80 పేజీలతో, 700 శుభలేఖలు అచ్చువేయించి పంచుతున్నారు. బంధువులు, స్థానికులు ఈ శుభలేఖలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. శుభలేఖని చూసి వదిలేయొద్దని ఇలా అచ్చువేయించామని పెళ్లి కుమారుడి తండ్రి నర్సింగరావు అంటున్నారు.
ఇదీ చదవండి: మంత్రి రోజా ఫోన్ కొట్టేశాడు.. పోలీసులు అలా పట్టేశారు..!