ETV Bharat / city

ఏలూరులో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానం

ఏలూరులో అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆరోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా నగరంలోని పారిశుద్ద్య పరిస్థితి మెరుగు పరిచే చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

eluru eenadu
eluru eenadu
author img

By

Published : Dec 7, 2020, 7:05 AM IST

ప్రజలు ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏలూరు నగరపాలక సంస్థ యంత్రాంగం పారిశుద్ధ్య పరిస్థితి మెరుగునకు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పేరుకుపోయాయి. జంతు కళేబరాలు, చెత్తాచెదారంతో నిండిన మురుగు కాలువలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. పందుల్ని పట్టించి నగరానికి దూరంగా తరలించాల్సి ఉండగా చర్యలు చేపట్టలేదు.

‘నాలుగు రోజులుగా తాగునీరు కొంచెం తేడాగా ఉంది. వాల్వులు, పైపులైన్లలో మురుగునీరు చేరి కలుషితమవుతోంది’ అని రాంబాబు తెలిపారు.

తమ ప్రాంతంలో పందుల బెడద అధికంగా ఉందని, గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తూ ఇళ్లలో చొరబడుతూ పరిసరాల్ని అపరిశుభ్రం చేస్తున్నాయని స్థానికురాలు సీతామహాలక్ష్మి వాపోయారు.

ఇదీ చదవండి:

ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రులకు పోటెత్తుతున్న బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.