ETV Bharat / city

వచ్చారు.. వెళ్లారు.. ఆశలు ఆవిరి చేశారు.. కేంద్రంపైనే భారం వేశారు - ఏపీ తాజా వార్తలు

తమ ఆశలపై ముఖ్యమంత్రి నీళ్లు జల్లారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో సతమతమైన తమ బతుకులు చూసినా సీఎం మనసు చలించలేదని... పూర్తిగా కేంద్రంపైనే భారం వేశారని వాపోతున్నారు. కాంటూరు వాసులు మరికొన్నేళ్ల పాటు వరదలను భరించాల్సిందేనని చెప్పకనే చెప్పినట్లయిందని నిట్టూరుస్తున్నారు.

residents
నిర్వాసితుల ఆవేదన
author img

By

Published : Jul 28, 2022, 10:14 AM IST

ముఖ్యమంత్రి జగన్‌ వచ్చారు.. వెళ్లారు. కానీ పోలవరం నిర్వాసితుల సమస్యకు పరిష్కారం దొరకలేదు. వరదలతో తలకిందులైన తమ బతుకులు చూసైనా ముఖ్యమంత్రి మనసు చలిస్తుందని ఆశించారు. కానీ ఆయన కేంద్రపైనే భారం వేశారు. +41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలకు సెప్టెంబరు నెలాఖరులోగా పరిహారం ఇస్తామని, +45.72 కాంటూరు పరిధిలోని గ్రామాలకు పరిహారంపై కేంద్రంతో మాట్లాడతామని సీఎం జగన్‌ తెలిపారు. ‘వెయ్యి, 2 వేల కోట్లయితే ఏదోలా సర్దుకునేవాడిని.. ఏకంగా రూ.20వేల కోట్లు అవసరం కాబట్టి కేంద్ర సహాయం తప్పక తీసుకోవాల్సిందే. పెద్ద మనసుతో అర్థం చేసుకోండి’ అంటూ నిర్వాసితులను అభ్యర్థించారు. +41.15 కాంటూరు పునరావాసంపై అధికారులు మొదటి నుంచీ సెప్టెంబరు నెలాఖరును డెడ్‌లైన్‌గా చెబుతున్నారు. ముఖ్యమంత్రీ అదే పునరుద్ఘాటించారు. +41.15 కాంటూరుకు సెప్టెంబరులోగా ఇస్తామని తెలిపారంటే, +45.72 కాంటూరు వాసులు మరికొన్నేళ్ల పాటు వరదలను భరించాల్సిందేనని చెప్పకనే చెప్పినట్లయింది.

+41.15 అంటే పెద్దగా ప్రయోజనం లేదు
ప్రస్తుతానికి +41.15 కాంటూరు పరిధికే పరిహారమన్న ముఖ్యమంత్రి మాటలు నిర్వాసితులకు పెద్దగా రుచించలేదు. ఆ కాంటూరులో పునరావాసం పొందే గ్రామాలు చాలా తక్కువ. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉండగా, వరదలు అన్ని పంచాయతీలను ముంచేశాయి. కానీ, ఈ మండలంలో +41.15 కాంటూరు స్థాయిలో ఉన్నది ఒకే ఒక్క గ్రామం. మిగతా గ్రామాలన్నీ +45.72 కాంటూరులో ఉన్నాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలానిదీ అదే పరిస్థితి. ఈ మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉండగా అవన్నీ ఇటీవల వరదలకు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. ఆ మండలంలో +41.15 కాంటూరు పరిధిలో ఉన్నవి 8 గ్రామాలే!

లైడార్‌ సర్వేపై ఆశలు
సీఎం ప్రసంగంలో కాస్త ఆశాజనకంగా కనిపించిన మాట లైడార్‌ సర్వే. ఆ సర్వే పూర్తయిందని, ప్రస్తుతం ఎనాలసిస్‌ జరుగుతోందని, ఆ సర్వే ఫలితాలు వచ్చాక +41.15 కాంటూరుపై స్పష్టత వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. దానిద్వారా ప్రస్తుతం +45.72 కాంటూరులో ఉన్న కొన్ని గ్రామాలు +41.15 కాంటూరులోకి వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. అలాంటి గ్రామాలకూ సెప్టెంబరుకల్లా పునరావాసం చెల్లించి, గ్రామాలను ఖాళీ చేయిస్తామని చెప్పడం కొంత ఊరటనిచ్చే అంశం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.