Pre Christian objects: ఈ చిత్రాల్లో కనిపిస్తున్న పూసలు, కుండలు క్రీస్తు పూర్వం నాటివి. చారిత్రక సంపద పరిరక్షణలో భాగంగా ఏలూరు జిల్లా పోలవరం ముంపు ప్రాంతమైన వేలేరుపాడు మండలం రుద్రమకోట పరిసరాల్లో పురావస్తుశాఖ ఇటీవల తవ్వకాలు చేపట్టింది. అలంకరణకు వినియోగించిన తెలుపు, ఎరువు, పచ్చని రాతి పూసలు, మట్టిపాత్రలు, ఆయుధాలు లభ్యమయ్యాయని సహాయ సంచాలకులు కె.తిమ్మరాజు తెలిపారు. ఆదిమానవులు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకునే వారని.. మరణానంతరం వారు వినియోగించిన వస్తువులను ఇలా సమాధుల్లో పూడ్చిపెట్టేవారని తెలిపారు. ప్రస్తుతం వీటిని ఏలూరులో లాకర్‌లో భద్రపర్చామన్నారు.
![Pre Christian objects](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15047054_vaz.png)