పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్ సహా పది పట్టణాలలో ప్రస్తుతం ఇరవై ఒక్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 15 సొంత భవనాలలో నిర్వహిస్తుండగా, 4 అద్దె భవనాలలోనూ, రెండు సామాజిక సామాజిక భవనాలోనూ నిర్వహిస్తున్నారు. ఏలూరులో 7, తాడేపల్లిగూడెం, భీమవరంలో మూడేసి, తణుకు, నరసాపురంలో రెండు వంతున, కొవ్వూరు, నిడదవోలు, పాలకొల్లు జంగారెడ్డిగూడెంలో ఒక్కొక్కటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
ప్రభుత్వం కొత్తగా ఏలూరులో 3, భీమవరంలో 2, తాడేపల్లిగూడెం తణుకు కొవ్వూరు నిడదవోలు పాలకొల్లు జంగారెడ్డిగూడెం నరసాపురం ఆకివీడు పట్టణాలకు ఒక్కొక్కటి వంతున మంజూరు చేసింది. ప్రైవేటు భవనాలు, సామాజిక భవనాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య కేంద్రాల్లో తగినన్ని వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్న తీరును ప్రభుత్వం గుర్తించింది. పట్టణంలో ప్రతి 25 వేల మందికి ఒక ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉండేలా చేయటానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేసింది.
వీటి నిర్మాణానికి స్థల సేకరణ పూర్తి కాగా, ఒక్కొక్క కేంద్రానికి భవన నిర్మాణ వసతుల కల్పనకు 80 లక్షల రూపాయలు మంజూరు చేసింది. కొత్తగా మంజూరు చేసిన కేంద్రాలతో పాటు అద్దె భవనాలు, సామాజిక భవనాల్లో నిర్వహిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొత్త భవనాలను నిర్మించడానికి వసతులు కల్పించడానికి 80 లక్షల రూపాయల వంతున మంజూరు చేశారు. వీటితోపాటు ప్రస్తుతం ప్రజలకు సేవలు అందిస్తున్న ఆరోగ్య కేంద్రాల్లో కూడా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: