పశ్చిమగోదావరిజిల్లాపై తీవ్రవాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. జలాశయాలకు భారీగా నీరు చేరుతోంది. తమ్మిలేరు, ఎర్రకాలువ జలాశయాల వరద పోటెత్తుతోంది. వరదనీరు పట్టణాలను ముంచెత్తుతోంది. తమ్మిలేరుకు రికార్డు స్థాయిలో వరద వస్తుండటంతో వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఈ కారణంగా ఏలూరు నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఏలూరు నగరంలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. పదుల సంఖ్యలో కాలనీల్లోకి నీరు చేరింది. పశ్చిమగోదావరి జిల్లాలో వరద పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు.
ఇదీ చదవండి: