ETV Bharat / city

కౌలు రైతుల ఆత్మహత్యలపై తప్పుడు నివేదిక.. ఎంపీడీవో సస్పెన్షన్​ - ఏలూరు జిల్లా లేటెస్ట్ అప్​డేట్స

MPDO suspended: తప్పుడు నివేదిక ఇచ్చినందుకు ఏలూరు జిల్లా లింగపాలెం ఎంపీడీవో కుమార్​ను సస్పెండ్​ చేస్తూ కలెక్టర్​ ఉత్తర్వులు జారీ చేశారు. లింగపాలెం మండలంలో కౌలు రైతుల మరణాలు అసలు లేనట్లు కలెక్టర్‌కు అబద్ధపు నివేదిక ఇచ్చిన ఎంపీడీవోపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Lingapalem MPDO suspended
ఎంపీడీవో సస్పెండ్​
author img

By

Published : Apr 29, 2022, 1:12 PM IST

MPDO suspended: ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఎంపీడీవో విజయ్‌కుమార్‌ బాబును తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. లింగపాలెం మండలంలో కౌలు రైతుల ఆత్మహత్యలు వాస్తవం కాదని నివేదిక ఇవ్వడంతో ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కౌలు రైతుల ఆత్మహత్యలపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించగా.. లింగపాలెం మండలంలో ఆత్మహత్యలు చోటు చేసుకోలేదని ఎంపీడీవో విజయ్‌కుమార్‌ బాబు నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా మరోసారి డీఆర్‌డీఏ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఏడుగురు కౌలు రైతులు ఆత్మహత్యలు వాస్తవమేనని రుజువైంది. అధికారులు ఈ నివేదికను కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌కు అందించారు. ఉద్యోగ బాధ్యతల్లో అలసత్వం ప్రదర్శించిన ఎంపీడీవోను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి: TTD: రేపు తితిదే ధర్మకర్తల మండలి సమావేశం..టైంస్లాట్‌ టోకెన్ల జారీపై నిర్ణయం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.