పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్, ఎస్సై గంగాధర్‌లను ఏలూరు రేంజ్ డీఐజీ కే.వి మోహన్‌రావు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఇటీవల జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కొంతమంది ప్రముఖులు.. బల్క్ బుకింగ్‌లో ఇసుకను తరలించి నల్లబజారులో విక్రయించారు. వారిపై కేసు నమోదు చేయకుండా తారుమారు చేశారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణ సమయంలో కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని మాయం చేశారన్న అభియోగంపై సీఐ, ఎస్సైని డీఐజీ సస్పెండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఠాణా పరిధిలో పట్టుబడిన తెలంగాణ మద్యం మాయమైన ఘటనలోనూ అప్పటి ఎస్సై గంగాధర్‌పై కేసు నమోదు అయింది. ఈ ఘటనలో ఇద్దరిపై సస్పెండ్ వేటు పడినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ... ప్రభుత్వం, అధికారులు.. దేవాలయాల జోలికి రావొద్దు: పరిపూర్ణానంద