వైకాపా ప్రభుత్వం రాజకీయంగా, పాలనాపరంగా విఫలమైందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. ఏలూరు ఆస్పత్రిలో మృతదేహం కళ్లను ఎలుకలు తినేసిన ఘటనే దీనికి నిదర్శనమని అన్నారు. సీఎం జగన్, మంత్రులు బుగ్గన, ఆళ్ల నాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ రద్దు నిర్ణయం కూడా సరికాదని అశోక్‌బాబు హితవు పలికారు. ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా పథకంతో పేద రోగులకు న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ డొల్లతనం బయటపడుతుందని అశోక్‌బాబు అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. మండలి రద్దు తీర్మానం చేసినంత మాత్రాన అమరావతిపై తమ పోరాటం ఆగదని అశోక్‌బాబు పేర్కొన్నారు. ప్రత్యక్ష పోరాటంలోకి దిగి... అమరావతిని కాపాడుకుంటామని వెల్లడించారు.
ఇదీ చదవండి: