ETV Bharat / city

'రాజధాని నాశనం అవుతుంటే ఎమ్మెల్యేలు ఎటు పోయారు'.. రైతుల ఆవేదన - అమరావతి రైతుల ఆందోళనలు

రాజధాని రైతులు మలిదశ ఉద్యమంలోకి దిగారు. కొవిడ్ నిబంధనలతో ఇన్నాళ్లూ ఇంటి వద్దే నిరసన చేపట్టిన రైతులు, మహిళలు ఇక నిరసనను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలకు తెరలేపారు. గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించి.. రాజధాని కోసం భూములిచ్చిన వేలాదిమంది రైతుల కుటుంబాలను వీధిన పడేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'రాజధాని నాశనం అవుతుంటే ఎమ్మెల్యేలు ఎటు పోయారు'.. రైతుల ఆవేదన

author img

By

Published : Aug 3, 2020, 10:01 PM IST

Updated : Aug 4, 2020, 3:03 AM IST

హోరెత్తుతున్న అమరావతి రైతుల నిరసనోద్యమం

అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళల నిరసనోద్యమం మళ్లీ ఊపందుకుంది. కొవిడ్ కారణంగా కొన్నాళ్లు ఇళ్లలోనే నిరసన చేపట్టిన రైతులు.. బహిరంగంగా శిబిరాల్లోనే తమ గళాన్ని వినిపిస్తున్నారు. ధర్నా శిబిరాలను మళ్లీ పునరుద్ధరించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ఆమోదంతోపాటు సీఆర్డీఏ చట్టాన్ని గవర్నర్ రద్దు చేయడంతో రాజధాని గ్రామాల్లో మళ్లీ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భూములిచ్చిన రైతుల భవిష్యత్తు ఏంటో చెప్పకుండా... 230 రోజులుగా నిరసనలు చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించిందంటూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు మండిపడుతున్నారు.

పోరాటం సాగిస్తాం

తుళ్లూరు, మందడం, వెలగపూడి, పెదపరిమి ప్రాంతాల్లో రైతులు.... నిరసన దీక్షలకు మళ్లీ శ్రీకారం చుట్టారు రైతులు. జై అమరావతి... జై ఆంధ్రప్రదేశ్ నినాదాలతో ధర్నా శిబిరాలు హోరెత్తాయి. వ్యక్తిగత, పార్టీ కక్షలు దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్రభుత్వం రైతుల పొట్ట కొడుతుందంటూ రైతులు నినాదాలు చేశారు. అదే సమయంలో కేంద్రం కావాలనే ప్రేక్షకపాత్ర పోషిస్తుందని దుయ్యబట్టారు. తమ జీవితాలతో ముడిపడి ఉన్న రాజధాని సమస్య పరిష్కారమయ్యేదాకా క్షేత్రస్థాయిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని.. న్యాయపోరాటం చేస్తామని రైతులు స్పష్టం చేశారు. న్యాయదేవతే తమను కాపాడాలంటూ తుళ్లూరులో రైతులు, మహిళలు హైకోర్టు చిత్రపటానికి పూజలు నిర్వహించారు.

రాయలసీమకు ఒరిగిందేంటి..?

గవర్నర్ మూడు రాజధానుల నిర్ణయానికి ఆమోదం తెలపడంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్సీ బీటెక్ రవి..... తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం చెబుతున్నట్లు అధికార వికేంద్రీకరణ కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనన్న బీటెక్ రవి... జ్యుడీషియల్ రాజధానితో రాయలసీమకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు. ప్రశాంతమైన విశాఖపట్నాన్ని కలుషితం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. మూడు రాజధానులతో నష్టమే తప్ప లాభం లేదని... తమ ప్రాంతాలపై ప్రేమ ఉంటే గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని బీటెక్ రవి కోరారు. మూడు రాజధానులతో పేద రైతులు, కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని తుళ్లూరులో దళిత ఐకాస ఆందోళన వ్యక్తం చేసింది. అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన ఎస్సీ కూలీలు... ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలంటూ వేడుకున్నారు.

నిరాశ.. నిస్పృహే..!

మూడు రాజధానుల నిర్ణయంతో తమ జీవితాలు అతులాకుతలమయ్యాయని.... తమ జీవనాధారం ఏమిటంటూ ఉద్ధండరాయునిపాలేనికి చెందిన పూర్ణచంద్రరావు అనే యువకుడు భారీ క్రేన్ ఎక్కి దూకుతానంటూ బెదిరించారు. నేలపాడు సమీపంలోని ఎన్జీవో క్వార్టర్స్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం పక్కనే ఉన్న క్రేన్ ఎక్కిన అతడిని దించేందుకు ప్రయత్నం చేశారు. చివరకు అతడిని పోలీసులు దించగలిగారు. గవర్నర్ ప్రకటనతో రాజధాని ప్రాంతంలో నిరాశ, నిస్పృహలు రాజ్యమేలుతున్నాయని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని రైతులు, మహిళల మలిదశ ఉద్యమానికి వివిధ ప్రాంతాల నుంచి మద్దతు లభిస్తోంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఇకపైన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రాజధాని రైతులు, మహిళలు నిర్ణయించారు.

ఇదీ చదవండి:

అప్పు తీర్చలేదని మహిళను ట్రాక్టర్‌తో తొక్కించిన వైకాపా నాయకుడు

Last Updated : Aug 4, 2020, 3:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.