తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజల కష్టాలు చూడాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Ys Sharmila) డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగ నిరాహార దీక్షకు వచ్చిన షర్మిల.. తెలంగాణ విశ్వవిద్యాలయం గేటు ఎదుట ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను విస్మరిస్తూ ప్రైవేటు యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. తెలంగాణ యూనివర్సిటీ వీసీ స్వయంగా తాను రూ. రెండు కోట్లు... కేటీఆర్(Ktr)కు ఇచ్చి పదవి తీసుకున్నానని.. ఆ డబ్బు సంపాదించుకుంటే తప్పేంటని అనడం రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి అద్దం పడుతుందని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 100 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు ఇస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
ఈమధ్యే రెండు, మూడు నెలల కింద ఓ వీసీ వచ్చాడు. వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈయన ఈ పోస్టు తెచ్చుకోవడానికి కేటీఆర్కు రూ. రెండు కోట్లు ఇచ్చాడంటా. ఈ రెండు కోట్లు ఇక్కడ సంపాదించుకుంటే తప్పేంటని అని అడిగారు వీసీ. ఇలాంటి మనిషి ఈ యూనివర్సిటీకి మేలు చేస్తాడంటే ఎలా నమ్మకం కుదురుతుంది. 73 పోస్టులు పర్మినెంట్ బేసిస్ మీద ఇంటర్వూలకు పిలిచి... పద్ధతులు ఏవి ఫాలో అవ్వకుండా.. 50 మందిని రాత్రికిరాత్రే ఎవరికి తెలియకుండా టెంపరరీ బేసిస్ మీద నియమించాడు. ఎందుకని అడిగితే క్రిమినల్ కేసులు పెడతాడంటా వీసీ వాళ్లమీద. ఏం వీసీ ఎలా ఉంది? నిరుద్యోగులు తలుచుకుంటే ఏమైపోతారో అర్థమవుతుందా? నిరుద్యోగులు, యువత తలుచుకుంటే మీరు ఉండరు? మీ వెనకాల ఉన్న కేసీఆర్ ఉండడు. వీసీని డిమాండ్ చేస్తున్నాం. టెంపరరీ బేసిస్ మీద కాదు.. పర్మినెంట్ బేసిస్ మీద ఇంటర్వూలకు పిలవండి. పద్ధతి ప్రకారం నిర్వహించండి. నాన్ టీచింగ్ స్టాఫ్ అది కూడా వెంటనే భర్తీ చేయాలని వీసీని డిమాండ్ చేస్తున్నాం. నిన్నటికి నిన్న కేసీఆర్ కొడుకు కేటీఆర్... అసెంబ్లీ సాక్షిగా కేవలం 4, 5 శాతం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలమని తెలిపాడు. - వైఎస్ షర్మిల, వైఎస్ఆర్టీపీ చీఫ్
ఇదీ చదవండి:
Polavaram: పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణం