ETV Bharat / city

మండలిలో సంఖ్యా బలం పెంచుకునేందుకు వైకాపా కసరత్తు - ఏపీ మండలి న్యూస్

శాసనమండలిలో బలం పెంచుకునేలా అధికార వైకాపా వ్యూహం రచిస్తోంది. ఇందుకోసం ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టింది. ఇటీవలే ఓ స్థానాన్ని పెంచుకున్న వైకాపా..మరో నెల రోజుల్లో 4 స్థానాలు భర్తీ చేసేలా కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి మండలిలో తమ బలం 30కి చేరుకునేలా ప్రయత్నిస్తోంది.

ysrcp, ap council
మండలిలో సంఖ్యా బలం పెంచుకునేందుకు వైకాపా కసరత్తు
author img

By

Published : Jun 29, 2020, 6:05 AM IST

శాసన మండలిని రద్దుచేస్తూ అధికార వైకాపా శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. అప్పుడే మండలి రద్దవుతుంది. కరోనా దృష్ట్యా పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో.. జరిగినా ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం అజెండాలో ఉంటుందో ఉండదో అనే దానిపై స్పష్టత లేని పరిస్ధితి. ఈ తరుణంలో మండలి రద్దయ్యేంత వరకూ వేచి చూడకుండా శాసన మండలిలో సంఖ్యా బలాన్ని పెంచుకుంటే బాగుంటుందనే వ్యూహాన్ని అధికార వైకాపా రచిస్తోంది.

బిల్లులకు ఎదురుదెబ్బ...

మండలిలో బలంలేని కారణంగా.... ప్రభుత్వ బిల్లులకు మండలిలో ఎదురుదెబ్బ తగులుతోంది. అక్కడ మెజారిటీ ఉన్న తెలుగుదేశం పలు బిల్లులను ఆమోదింపేజేయకుండా తిప్పి పంపుతోంది. ఆంగ్లమాద్యమం బిల్లును ఇలాగే తిప్పిపంపింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు ఆమోదానికి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసినా మండలిలో ప్రభుత్వం ఆమోదించుకోలేక పోయింది. ఈ పరిణామాలతో మండలిలో వీలైనంత త్వరగా సంఖ్య పెంచుకునేలా అధికార పార్టీ దృష్టి పెట్టింది. మండలిలో ప్రస్తుతం పార్టీల బలాబలాలు, ఎప్పుడెప్పుడు ఎంత మంది సభ్యుల పదవీకాలం పూర్తవుతుందనే దానిపై ఆ పార్టీ ప్రతినిధి బృందం లెక్కలు కట్టింది. ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు వచ్చే ఏడాది మార్చిలో, జూన్‌లో పదవీకాలం ముగుస్తున్న వారి సంఖ్యతో కలిపి సుమారు 25 ఖాళీలు ఏర్పడతాయన్న అంచనాకు వచ్చింది. ఇప్పటికే గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయనుండటంతో మరో 2 స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఈ నాలుగింటినీ నెల రోజుల్లో ఒకేసారి భర్తీ చేస్తే బాగుంటుందనే యోచనలో వైకాపా నాయకత్వం ఉన్నట్లు తెలిసింది. తాజాగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎన్నికతో మండలిలో వైకాపా ఎమ్మెల్సీ సంఖ్య 10కి చేరింది.

మెజార్టీ స్థానాల కోసం...

వచ్చే ఏడాది జూన్ నాటికి ఖాళీ కానున్న 25 స్థానాల్లో వైకాపావి 4 ఉన్నాయి. ఈ నాలుగింటిని గెలుచుకోవడంతో పాటు మిగిలిన 21 లోనూ మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు ఉన్న అవకాశాలను ఆ పార్టీ పరిశీలిస్తోంది. గవర్నర్ కోటా, ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయ్యే స్థానాలు 12 ఉంటాయని ఇవన్నీ తమకే దక్కే అవకాశం ఉందని వైకాపా అంచనా వేసింది. వచ్చే ఏడాది జూన్ నాటికి స్థానిక సంస్థల కోటాలో 8 స్థానాలు ఖాళీ అవుతుండగా..వాటిలో ఏడు తేదేపావే ఉన్నాయి. అప్పటిలోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తైతే.. వైకాపాకే మెజారిటీ ఉంటుందని అందువల్ల 8 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ అత్యధికం తమకే వస్తాయని వైకాపా భావిస్తోంది. మొత్తంగా వచ్చే నెలరోజుల్లో నాలుగు, వచ్చే ఏడాది జూన్ కి మరికొన్ని కలిపి..మండలిలో వైకాపా సంఖ్యాబలం సుమారు 30కి చేరే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చింది.

ఇవీ చూడండి-కలహాల కాపురం.. తీసింది ముగ్గురి ప్రాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.