ETV Bharat / city

MLA Ambati On Special Status For AP: 'ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం చేస్తాం' - ఏపీ ప్రత్యేక హోదా వార్తలు

MLA Ambati On Special Status For AP: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకూ వైకాపా వెనక్కి తగ్గదని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. హోదా కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాడు ప్యాకేజీ తీసుకుని ప్రత్యేక హోదాను ముంచిన వ్యక్తి చంద్రబాబేనని ధ్వజమెత్తారు.

MLA Ambati On Special Status For AP
MLA Ambati On Special Status For AP
author img

By

Published : Dec 22, 2021, 6:51 PM IST

MLA Ambati On Special Status For AP: ప్రత్యేక హోదాపై మాట తప్పం.. మడమ తిప్పమని వైకాపా స్పష్టం చేసింది. రాష్ట్రానికి హోదా సాధించే వరకు పోరాటం చేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. హోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాలన్న చంద్రబాబు డిమాండ్ ను తిప్పి కొట్టారు. తాము ప్రభుత్వంలో ఉన్నవాళ్లమని.. హోదా కోసం మేము రాజీనామా చేయాలా..? అని ప్రశ్నించారు. గతంలో తెదేపా ఎంపీలు హోదా కోసం ఎందుకు రాజీనామా చేయలేదో..? చెప్పాలన్నారు.

MLA Ambati Fires On Chandrababu: రాష్టానికి హోదా కావాలని వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ డిమాండ్ చేస్తుందన్నారు అంబటి. ప్యాకేజీ తీసుకుని ప్రత్యేక హోదాను ముంచిన వ్యక్తి చంద్రబాబేనని ధ్వజమెత్తారు. భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదని, మమ్మల్ని అభాసుపాలు చేసేందుకు ఇలా ప్రయత్నిస్తున్నారన్నారు. తాము అనని మాటలు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారన్నారు.

ఓటీఎస్ వల్ల ప్రజలకు అనేక లాభాలు ఉన్నాయన్న అంబటి.. ఈ పథకంపై తెదేపా దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలను ప్రజలు ఎవరూ విశ్వసించడం లేదన్నారు. తెదేపా హయాంలో ఇళ్ల రుణాలను ఎందుకు మాఫీ చేయలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. ఇష్టం ఉన్నవారు ఒటీఎస్ కోసం ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

ఇదీ చదవండి:
పైన అసలు బంగారం.. లోపల నకిలీ బాగోతం.. వీళ్ల మోసం మామూలుగా లేదుగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.