ETV Bharat / city

YSRCP: గడప గడపలో సమస్యలే.. ఎమ్మెల్యేలను నిలదీస్తున్న జనం - వైకాపా గడప గడపలో మ్మెల్యేలను నిలదీస్తున్న ప్రజలు

YCP Gadapa Gadapaku Program: మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం.. రోడ్లు అసలు బాగాలేవు.. పింఛన్లు రావడం లేదు.. పథకాలు అందడం లేదు. ఇవీ గడపగడపకు వెళుతున్న వైకాపా ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి వినిపిస్తున్న మాటలు. సమస్యలు పరిష్కరిస్తామని కొందరు నేతలు చెబుతుంటే.. దాటవేస్తూ మరికొందరు అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోతున్నారు.

వైకాపా గడప గడపలో మ్మెల్యేలను నిలదీస్తున్న ప్రజలు

author img

By

Published : May 17, 2022, 8:33 AM IST

గడప గడపలో సమస్యలే.. ఎమ్మెల్యేలను నిలదీస్తున్న జనం

పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడిలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని... పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. ఈ గ్రామంలో ఆయనకు సమస్యలు స్వాగతం పలికాయి. రైతుభరోసా సక్రమంగా అందడం లేదని, వోటీఎస్​(OTS) పేరుతో వేలకు వేలు వసూలు చేయడం సరికాదని, పింఛన్లు పంపిణీలో సరిగా లేక ఇబ్బంది పడుతున్నామని... స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకి నివేదించారు. తాగునీటి సమస్య జటిలంగా ఉందని, దారుణంగా మారిన రోడ్లు బాగు చేయించాలని మరికొందరు కోరారు. ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందడం లేదని కొందరు నిలదీశారు.

కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురంలో పర్యటించిన ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి... తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలను ప్రజలు వివరించారు. గ్రామంలో చాలా మందికి పింఛన్లు తొలగించారని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. అన్నీ చేస్తామంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పర్యటించారు. ఎస్సీ కాలనీ వైపు ఆమె కారులో వెళుతుండగా... తాగునీరు రావడం లేదంటూ 5వ వార్డు ప్రజలు ఫ్లెక్సీ ప్రదర్శించారు. ఎమ్మెల్యే శ్రీదేవి తమను చూసినా పట్టించుకోకుండా వెళ్లిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి బ్రహ్మానందపురంలో గడపగడపకు కార్యక్రమం సందర్భంగా... అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. తాడేపల్లిలో నిర్వహించే కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడిని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిలవలేదంటూ.. కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇందుకు నిరసనగా తాడేపల్లి పట్టణ నేతలంతా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రానికి తెదేపా అవసరాన్ని చాటేలా.. మహానాడు జరపాలి : చంద్రబాబు

'ఊ అంటావా'కు రూ.5కోట్లు.. 'రోబో' పాటకు రూ. 20కోట్లు.. 'చమ్మక్​ చల్లో' బడ్జెట్​ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.