ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్​ఆర్​ 72వ జయంతి - YSR JAYANTI CELEBRATIONS

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్​ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకల్ని అభిమానులు, వైకాపా కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ బాటలో సీఎం జగన్​ నడుస్తున్నారని అన్నారు.

YSR
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్​ఆర్​ 72 జయంతి వేడుకలు
author img

By

Published : Jul 8, 2021, 5:57 PM IST

రైతు దినోత్సవం పేరుతో వైఎస్​ఆర్​ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్​ కట్​ చేసి, వైఎస్​ చిత్రపటానికి నివాళులర్పించారు. అభిమాన నాయకుడి జయంతి సందర్భంగా రక్త దానం చేశారు. కొందరు మొక్కలు నాటారు. వైఎస్​ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం సీఎం జగన్ అహర్నిషలు కృషి చేస్తున్నారని కొనియాడారు.

వైఎస్​ఆర్​ కడప జిల్లాలో..

కడపలోని ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ విగ్రహానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు పూలమాలవేసి నివాళులు అర్పించారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు.

జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో వైయస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పాలాభిషేకం చేసి పూల మాలలతో నివాళులర్పించారు.

అనంతపురం జిల్లాలో...

అనంతపురంలోని వైకాపా కార్యాలయంలో పార్టీ నాయకులు రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తండ్రి అడుగుజాడల్లో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ కొనియాడారు. రెండు తెలుగు రాష్ట్రాలకు వైఎస్​ అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. అలాంటి ఆయన్ను తెలంగాణ మంత్రులు తిట్టిపోయడం తగదని అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో...

తణుకు లో వైఎస్ 72 వ జయంతి వేడుకల్ని అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు నిర్వహించారు. పేద బడుగు వర్గాల అభ్యున్నతికి వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ఆచరణీయమని పేర్కొన్నారు. కార్యకర్తలు రక్తదానం చేశారు.

విజయనగరం జిల్లాలో...

తండ్రి ఆశయాన్ని నెరవేర్చడంలో సీఎం జగన్ నిమగ్నం అయ్యారని ఎమ్మెల్యే జోగారావు కొనియాడారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం పరిధిలో నిర్వహించిన వేడుకల్లో పురపాలిక ఛైర్​పర్సన్ గౌరీ ఈశ్వరి, వైస్ చైర్మన్ రుక్మిణి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లాలో...

గిద్దలూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో కార్యకర్తలతో వైఎస్​ జయంతిని శాసన సభ్యులు అన్నా వెంకట రాంబాబు ఘనంగా నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లాలో..

టెక్కలి నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్ని కార్యకర్తలతో కలిసి శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నందిగాం మండలం మర్లపాడు గ్రామంలో కళింగ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పేరాడ తిలక్.. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఇదీ చదవండి:

ఇడుపుల పాయలో వైఎస్​ఆర్​కు షర్మిల ఘన నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.