వైఎస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 10నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు పాలనా అనుమతులను విడుదల చేసింది.
ప్రపంచ అంధత్వ దినం పురస్కరించుకుని అక్టోబర్ 10 న వైఎస్ ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనుంది. మొత్తం 560కోట్లను పథకం కింద ఖర్చుచేయనుంది. ఈ మొత్తంలో..... 60శాతం రాష్ట్ర ప్రభుత్వం, 40శాతం కేంద్రం భరించనున్నాయి.
నాలుగు దశల్లో...
మొదట అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు...కంటి పరీక్షలను చేపట్టనున్నారు. అక్టోబర్ 10 నుంచి 15 వరకు మొదటిదశ పరీక్షలు నిర్వహిస్తారు. రెండో దశ పరీక్షలో.. కంటి అందాల సిఫార్సులు తదితర అంశాలను చేపట్టనున్నారు. మూడో దశలో..... సామాజిక కమ్యూనిటి సెంటర్లలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్లు... గ్రామీణ ప్రాంతాల్లో 2020 ఫిబ్రవరి నుంచి పరీక్షలు చేయిస్తారు. నాలుగోదశలో అవసరమైన వారికి శుక్లాల శస్త్ర చికిత్సలు, ఇతర వైద్య పరీక్షల కోసం సిఫారసు చేయనున్నారు.
ఇవీ చూడండి-ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం...ఈనెల 25 వరకు గడువు