2020-21 ఆర్ధిక సంవత్సరానికి వైఎస్ఆర్ చేయూత పథకం రెండో విడత చెల్లింపులకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో విడత కింద 151 కోట్ల 47 లక్షల రూపాయల్ని మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మొత్తాన్ని లబ్దిదారులకు అందించేలా చర్యలు చేపట్టాలంటూ ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్ధిక కార్పొరేషన్ ఎండీకి సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
వైఎస్ఆర్ చేయూత పథకానికి మైనారిటీ సంక్షేమ సహకార సంస్థ నుంచి రూ.36.75 కోట్లకు పాలనా అనుమతులను మంజూరు చేశారు. మరోవైపు పశువులు, గొర్రెల పెంపకం యూనిట్ల మంజూరుకు మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.
ఇవీ చదవండి..