ETV Bharat / city

హైదరాబాద్​లో... చివరి రోజుకు చేరుకున్న షర్మిల దీక్ష - తెలంగాణ వార్తలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి.. ఖాళీలను భర్తీ చేయాలని వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దీక్షా శిబిరం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

sharmila
చివరిరోజుకు చేరుకున్న షర్మిల దీక్ష
author img

By

Published : Apr 17, 2021, 12:07 PM IST

తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటూ వైఎస్‌ షర్మిల చేపట్టిన ‘ఉద్యోగ దీక్ష’ మూడో రోజుకు చేరుకుంది. శుక్రవారం దీక్షా శిబిరానికి షర్మిల తల్లి విజయమ్మ వచ్చి పరామర్శించారు. ప్రాణం పోయినా మంచినీళ్లు ముట్టనని, 72 గంటల దీక్షను కొనసాగిస్తానని షర్మిల తేల్చి చెప్పారు. నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని నిరుద్యోగులను కోరారు.

గురువారం సాయంత్రం ఇందిరాపార్క్‌ వద్ద దీక్షను భగ్నం చేసి లోటస్‌పాండ్‌కు తరలిస్తున్న క్రమంలో షర్మిల ఎడమ చేతికి గాయం కాగా వైద్యులు పరీక్షించి పట్టీ వేశారు. ఆమె చక్కెర స్థాయిని, రక్తపోటునూ పరీక్షించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమె చేతికి నల్ల రిబ్బను కట్టుకున్నారు. లోటస్‌పాండ్‌ వద్దకు నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. కళాకారులతో కళాజాత ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. షర్మిల కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్న కొండా రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

'ఏసీపీ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలి'

పాదయాత్రగా వెళ్తున్న తమ నాయకురాలితో అనుచితంగా, దురుసుగా ప్రవర్తించిన ఏసీపీ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ షర్మిల అనుచరులు శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆయన షర్మిల మెడపై చేయివేసి పోలీసు వాహనం వైపు లాక్కెళ్లారని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమె దుస్తులు చిరిగాయని పేర్కొన్నారు. ఇదే ఫిర్యాదును గవర్నర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర పోలీసు అధికారులకూ పంపారు.

ఇదీ చూడండి:

తిరుపతిలోకి బయట వ్యక్తులు చొరబడ్డారు: ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.