ETV Bharat / city

వీడియో కాల్​తో లక్షలు దోచేస్తున్నారు..! - cyber fraud latest cases

పరిమితులు లేని శృంగారం.. అవధుల్లేని ఆనందం పొందండి అంటూ తెలుగు రాష్ట్రాల్లోని యువకులు.. వృత్తి నిపుణులే లక్ష్యంగా పశ్చిమ్​బంగ, భరత్‌పూర్‌ ముఠాలు వలపువలలు విసురుతున్నాయి. తొలుత సంక్షిప్త సందేశాలతో పలకరించి.. ఆపై అందమైన యువతులతో ఫోన్లు చేయిస్తున్నాయి. బాధితుల నుంచి రూ.లక్షలు కొల్లగొట్టేందుకు కొందరు యువతులు నగ్నంగా వీడియో కాల్స్‌ చేస్తున్నారు.

fraud with video call
మోసం
author img

By

Published : Feb 25, 2021, 12:05 PM IST

ఉచితంగా పేరు నమోదు చేసుకోండి.. మెట్రోనగరాల్లో పంచతార హోటళ్లు... శివార్లలోని రిసార్టుల్లో విందు.. వినోదాల్లో మునగండి అంటూ యువతులు వలలు విసురుతున్నారు... వలకు చిక్కిన బాధితులు.. రూ.వేలు.. రూ.లక్షలు నగదు బదిలీచేయగానే... ఫోన్లు ఆపేస్తున్నారు. రెండు నెలల క్రితం ఓ వైద్య నిపుణుడి నుంచి రూ.39 లక్షలు కొట్టేశారు. కొద్దిరోజుల క్రితం ముగ్గురు యువకులు వేర్వేరుగా పోలీసులకు డేటింగ్‌ మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు బాధితులతో మాట్లాడేందుకు ఉపయోగించిన సిమ్‌కార్డు నంబర్లు, చరవాణుల ద్వారా మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

సంఘంలో సభ్యత్వం.. డేటింగ్‌ ఉచితం...

సంక్షిప్త సందేశాలకు స్పందించిన యువకులు, వృత్తి నిపుణులకు కోల్‌కతా నుంచి కొందరు యువతులు ఫోన్‌ చేస్తున్నారు. యువకుల చిరునామాలు తెలుసుకుని వారుంటున్న ప్రాంతాలకు సమీపంలోనే ఉన్నామంటూ చెబుతున్నారు. హద్దుల్లేని శృంగారాన్ని ఆస్వాదించేందుకు మెట్రోనగరాల్లో ప్రత్యేకంగా క్లబ్బులున్నాయని, రూ.25వేలతో సభ్వత్యం తీసుకుంటేచాలు... సభ్యులంతా హోటళ్లు... రెస్టారెంట్లు.. రిసార్టులకు వెళ్లొచ్చని వివరిస్తున్నారు.

సభ్యత్వం తీసుకున్న తర్వాత ఇద్దరు, ముగ్గురు యువతులు ఫోన్లు చేసి తాము క్లబ్బులో సభ్యులమని పరిచయం చేసుకుంటున్నారు. నగరంలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వెళ్దామా? వికారాబాద్‌, మొయినాబాద్‌ రిసార్టుల్లో గడుపుదామంటున్నారు. సరేనంటూ బాధితులు అంగీకరించిన వెంటనే... అక్కడ గదులు రిజర్వ్‌ చేసుకుందాం... మద్యం తీసుకుందాం... నగదు బదిలీ చేయండి అంటూ అభ్యర్థిస్తున్నారు. నగదు బదిలీ చేయగానే... డబ్బు రాలేదని, మరోసారి పంపించండని చెప్పి రూ.లక్షలు నగదు బదిలీ చేయించుకుంటున్నారు. బాధితుడికి అనుమానం రాగానే సంభాషణలు ఆపేస్తున్నారు. వారి పేర్లు, చిరునామాలు గుర్తించకుండా సిమ్‌కార్డులు తీసేస్తున్నారు.

ఏకాంతసేవ అంటూ రూ.39లక్షలు స్వాహా

హైదరాబాద్‌లో ఉంటున్న ఒక వైద్య నిపుణుడి నుంచి కోల్‌కతాకు చెందిన ఇద్దరు యువతులు ఏకాంతసేవ పేరుతో రూ.39 లక్షలు కొల్లగొట్టారు. వైద్య నిపుణుడి చరవాణికి వీరు రెండు నెలలక్రితం సంక్షిప్త సందేశం పంపించారు. ఆయన స్పందించగానే... ఒక యువతి వాట్సాప్‌కాల్‌ చేస్తానంటూ చెప్పి నగ్నంగా కనిపిస్తూ మాట్లాడింది. జూబ్లీహిల్స్‌లో ఉంటున్నానని, వైద్య నిపుణులంటే తనకు ఇష్టమని చెప్పింది. మరుసటిరోజు రెండోయువతి ఫోన్‌చేసి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పరిచయం చేసుకుంది. ముంబయికి చెందిన తాను ఒంటరిగా గచ్చిబౌలిలో ఉంటున్నానని, ఇంటి నుంచే పనిచేస్తున్నందున తన ఫ్లాట్‌కు ఎప్పుడైనా రావచ్చంటూ చెప్పింది. క్లబ్బులో సభ్యత్వం తీసుకోమంటూ ఇద్దరూ ప్రోత్సహించారు. సభ్యత్వం పేరుతో వైద్య నిపుణుడు రూ.లక్ష బదిలీ చేశాడు. ఇక అప్పటి నుంచి ఆయన నుంచి నగదు బదిలీ చేసుకునేందుకు రోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకూ నగ్నంగా వీడియోకాల్‌ ద్వారా మాట్లాడేవారు. డేటింగ్‌పై ఆసక్తి చూపుతున్నాడని గ్రహించి ఆసలు కథ మొదలుపెట్టారు. 45 రోజుల్లో రూ.39లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఇద్దరు యువతులు ఫోన్లు ఆపేశారు. వైద్యనిపుణుడు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

ఇదీ చూడండి: ఎన్నికల నేపథ్యంలో పరిశ్రమల శాఖ జీఎం బదిలీ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.