ETV Bharat / city

తెలంగాణ: ఇన్​స్టాలో అమ్మాయిల పేరుతో ఖాతా.. ఆపై బెదిరింపులు - instagram crime

ఇన్​స్టాగ్రామ్​లో యువతుల పేరుతో ఖాతాలు తెరిచి మోసం చేస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అసభ్యకర ఫొటోలు పంపి ఇప్పటికే 70 మంది అమ్మాయిలను బెదిరించినట్లు తెలిపారు.

తెలంగాణ: ఇన్​స్టాలో అమ్మాయిల పేరుతో ఖాతా.. ఆపై బెదిరింపులు

author img

By

Published : Feb 3, 2021, 5:13 PM IST

ఆన్​లైన్​లో యువతుల పేరుతో ఖాతాలు తెరిచి అమ్మాయిలను మోసగిస్తోన్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మణికొండలో ఉంటూ అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుమంత్.. ఇన్​స్టాగ్రామ్​లో అమ్మాయిల పేరుతో ఖాతా తెరిచి.. పలువురు యువతులతో చాటింగ్ చేసేవాడు. క్రమంగా వారితో స్నేహం పెంచుకుని.. వారి ఫొటోలు సేకరించి బెదిరింపులకు పాల్పడటం మొదలుపెట్టాడు. అసభ్యకర ఫొటోలు పంపి వేధించేవాడు.

ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమంత్​ను అరెస్టు చేశారు. ఇప్పటికే 70 మంది అమ్మాయిలను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు విజయవాడకు చెందిన వాడని వెల్లడించారు.

'నకిలీ ఇన్​స్టాగ్రామ్ ఖాతాను తెరిచి ఇంటర్నెట్​లో నుంచి అందమైన అమ్మాయి ఫొటో డౌన్​లోడ్ చేసి ప్రొఫైల్ తయారు చేస్తాడు. అమ్మాయిలా వేరే యువతులకు రిక్వెస్ట్ పంపిస్తాడు. అమ్మాయేగా అని రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వాళ్లతో చాటింగ్ మొదలుపెడతాడు. అమ్మాయితోనే మాట్లాడుతున్నామని భావించిన యువతులు.. సన్నిహితంగా మెలిగే తరుణంలో.. వారికి అసభ్యకరమైన ఫొటోలు పంపి.. వేధింపులకు పాల్పడతాడు. వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడతాడు' అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.

ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఏసీపీ ప్రసాద్ వెల్లడించారు.. ఇలాంటి వారిని గుర్తించడం కష్టమని చెప్పారు. సోషల్ మీడియాలో అమ్మాయిలు.. తెలియని వారితో చాటింగ్ చేయకూడదని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.