ETV Bharat / city

ఐదు నెలల క్రితమే ప్రేమ పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య.. అసలేమైంది?! - తెలంగాణ తాజా నేర వార్తలు

YOUNG COUPLE SUICIDE : వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు వారి వివాహానికి అంగీకరించలేదు. అయినా పెద్దలను ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఐదు నెలలపాటు కాపురం సజావుగా సాగింది. ఇంతలో ఏమైందో కానీ ఆ నవదంపతులు తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.

navaneethareddy, saigoud
నవనీతారెడ్డి, సాయిగౌడ్​
author img

By

Published : Jun 25, 2022, 6:55 PM IST

YOUNG COUPLE SUICIDE: వాళ్లిద్దరిది ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ. కలిసి జీవింతాంతం బతుకుదాం అనుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించి ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఇంతలో ఏ కష్టమొచ్చిందో తెలియదు.. నిండు నూరేళ్ల జీవితాన్ని నవదంపతులు అర్ధాంతరంగా ముగించారు. ఎన్నో ఆశలతో వివాహ జీవితాన్ని ప్రారంభించిన వారిద్దరూ... ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది.

రామంతాపూర్​కు చెందిన సాయిగౌడ్, నవనీతా రెడ్డి ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో ఐదు నెలల క్రితం పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. రామంతాపూర్​ శ్రీనగర్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఇద్దరు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ ఇంట్లో వారు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. అయితే మనస్పర్థల కారణంగానే చనిపోయి ఉంటారని స్థానికులంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:

భార్యను కాటేసిన పాము.. డాక్టర్లకు క్లారిటీ కోసం భర్త ఏం చేశాడంటే?

మార్నింగ్ వాక్​ చేస్తుండగా ఢీకొట్టిన బొలెరో.. పక్కకు తప్పుకునే ప్రయత్నం చేసినా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.