ఎమ్మెల్యే కోటా కింద రాష్ట్రంలో ఖాళీ అయిన... 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.... వైకాపా అభ్యర్థులు గెలుపొందారు. నాలుగు స్థానాలకు ఐదుగురు పోటీ పడడంతో ఎన్నిక అనివార్యమైంది. వైకాపా అభ్యర్థులు.. సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని... గెలుపొందారు. వైకాపా అభ్యర్థులకు 152 ఓట్లు పడగా.. తెదేపా అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. విజేతలకు... వైకాపా ముఖ్య నేత విజయసాయిరెడ్డి సహా పలువురు మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.
రాజ్యసభ ఎన్నికల వివరాలు..
మొత్తం ఓట్లు | 175 |
గైర్హాజరు | 2 |
పోలైనవి | 173 |
చెల్లని ఓట్లు | 4 |
వైకాపా | 152 |
తెదేపా | 17 |
ఎన్నికల్లో మొత్తం 175 మందికిగాను..సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా 173 మంది ఎమ్మెల్యేలు...ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈఎస్ఐ కేసులో అరెస్టైన అచ్చెన్నాయుడు ఓటు హక్కు వినియోగించలేకపోయారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇటీవలే కరోనాబారిన పడిన..... తెలంగాణ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలిసినందున సెల్ఫ్‌క్వారంటైన్‌లో ఉన్నట్లు అనగాని వెల్లడించారు. తెదేపాకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలిగిరి కూడా ఓటింగ్‌లో పాల్గొన్నా.. వారి ఓట్లు చెల్లలేదని.... అధికారులు తెలిపారు. ఇక రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కూడా టిక్ పెట్టడంతో ఆమె ఓటూ చెల్లనదిగా పరిగణించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు... జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రాధాన్యత ఓటు వేశారు. నలుగురు వైకాపా అభ్యర్థులకు 38 చొప్పున ప్రాధాన్యత ఓట్లు లభించాయి. తెదేపా అభ్యర్థికి 17 ఓట్లు వచ్చాయి.
విజేతలకు సీఎం జగన్ శుభాకాంక్షలు...
కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు సీఎం జగన్‌ను కలిశారు. సుభాష్ చంద్రబోస్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలు జగన్‌ను కలిసి కృతక్షతలు తెలిపారు. ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చదవండి: 'గెలవమని తెలిసే వర్ల రామయ్యకు రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారు'