ETV Bharat / city

'అమ్మఒడి నగదు మీ దగ్గరికే వస్తోందని సంతోషిస్తున్నారా..?' - ycp rebel mp raghurama krishna raju news

రాష్ట్ర ప్రభుత్వంపై వైకాపా రెబల్​ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు చేశారు. ప్రకాశం జిల్లా కురిచేడు ఘటన దురదృష్టకరమన్న ఆయన.. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. నిమ్మగడ్డను ఎస్​ఈసీగా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. జాతీయ నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్న ఆయన.. ఆంద్రప్రదేశ్​ను ఆంగ్లప్రదేశ్​గా మార్చొద్దని హితవు పలికారు.

'అమ్మఒడి నగదు మీ దగ్గరికే వస్తోందని సంతోషిస్తున్నారా..?'

author img

By

Published : Jul 31, 2020, 4:26 PM IST

రాష్ట్రంలో కల్తీ మద్యం ఎక్కువగా ఉందని.. ఊరూపేరూ లేని మద్యం బ్రాండ్‌లన్నీ ఇక్కడే దొరుకుతున్నాయని వైకాపా రెబల్​ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ప్రకాశం జిల్లా కురిచేడులో కల్తీ మద్యం తాగి 13మంది చనిపోవడం దురదృష్టకరమన్న ఆయన.. రాష్ట్రంలో పూర్తి మద్యపాన నిషేధం అమలు చేయాలని అన్నారు. లేదా సరైన బ్రాండ్లు దొరికేలా చేయాలని సూచించారు. ఆంధ్ర గోల్డ్​ పేరిట మద్యం ఎక్కువగా సరఫరా అవుతుందని పేర్కొన్నారు. పేరున్న మద్యం బ్రాండ్లు రాష్ట్రంలో ఎందుకు దొరకడం లేదనే అంశంపై సీఎం జగన్​ సమీక్ష చేయాలని రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. మద్యాన్ని అధిక ధరలకు కొనే స్థోమత లేకనే వ్యసనపరులు శానిటైజర్లు తాగుతున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి జగన్​ చాలా విషయాల్లో స్పందించారని.. కల్తీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని.. ఈ విషయాన్ని కూడా పట్టించుకోవాలని రఘురామకృష్ణరాజు సూచించారు. అమ్మఒడి డబ్బులు నాన్నఒడిలోకి వెళ్లిపోతున్నాయని.. ఇవి తిరిగి మీ దగ్గరికే వస్తున్నాయని సంతోషిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

హర్షిస్తున్నా..!

నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​ను తిరిగి ఎస్​ఈసీగా నియమించడం శుభపరిణామమని రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో డీజీపీ సైతం నాలుగు సార్లు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని అన్నారు. న్యాయవ్యవస్థకు విలువ ఇవ్వకపోవడం వల్ల ఇటీవల చాలా పరిణామాలు తలెత్తాయన్న ఆయన.. సీఎం జగన్​ ఆలస్యంగానైనా ఈ విషయంపై స్పందించారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని పొగిడే గ్రేట్​ ఆంధ్ర పత్రిక ఎస్​ఈసీ వ్యవహారంలో.. విమర్శిస్తుంటే సర్కారు పోకడ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

అర్థం చేసుకోండి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యా విధానాన్ని సరిగా అర్థం చేసుకోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్​ను ఆంగ్లప్రదేశ్​గా మార్చొద్దన్న ఆయన.. ఒకవేళ ఈ విధానాన్ని వక్రీకరించినా.. సుప్రీంకోర్టు దాన్ని సరిదిద్దుతుందని.. అప్పుడైనా కోర్టు మాట వినాలని ప్రభుత్వానికి హితవు పలికారు.

మరో లేఖ..!

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధాని మోదీ ఆగస్టు 5వ తేదీన భూమి పూజ చేస్తారని.. సీఎం జగన్​ కూడా ఈ కార్యక్రమానికి హాజరైతే బాగుంటుందని ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించే విధంగా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరారు. ఆ శాఖ ఆధ్వర్యంలోని 24 వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు , వేద పఠనం నిర్వహించాలని కోరారు. భూమి పూజ కార్యక్రమాన్ని తితిదే ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని లేఖలో కోరారు.

ఇదీ చూడండి..

కురిచేడు దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.