ETV Bharat / city

'స్థానికం'లో జిల్లాలకు జిల్లాలే వైకాపా పరం - ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా అధికశాతం ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను వైకాపా తన ఖాతాలో వేసుకుంది. చాలాచోట్ల వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. పులివెందుల, పుంగనూరు నియోజకవర్గాల్లో అన్ని స్థానాలు వైకాపా పరమయ్యాయి.

AP LOCAL ELECTIONS
AP LOCAL ELECTIONS
author img

By

Published : Mar 15, 2020, 8:07 AM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసేసరికే చాలాచోట్ల వైకాపా హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులోని స్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులు ఏకగీవ్రంగా గెలిచారు. పలువురు మంత్రుల నియోజకవర్గాల్లోనూ మెజార్టీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులే విజయం సాధించారు. నామినేషన్లు వేయకుండా తొలిరోజు నుంచే అడ్డగింతలు, దౌర్జన్యాలు.. నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించివేయడం, తీవ్రస్థాయి బెదిరింపులు, వేధింపులు.. తదితర ఉద్రిక్త పరిణామాల మధ్య జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ శనివారం పూర్తయింది.

నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం 3 గంటల వరకే గడువు ఉండగా.. పలు మండలాల్లో రాత్రి దాకా కొనసాగింది. దీనిపై గుంటూరు జిల్లా వినుకొండ, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలాల్లో తెదేపా నేతలు ఆందోళనలు చేశారు. తమను బలవంతంగా తీసుకొచ్చారని కొందరు.. అధికారులు, వైకాపా నేతలు కుమ్మక్కై తమ సంతకాలు ఫోర్జరీ చేసి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారని కొన్ని జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఆరోపించారు.

ముఖ్యమంత్రి ఇలాకాలో..

సీఎం సొంత జిల్లా కడపలో 50 జడ్పీటీసీ స్థానాలకుగాను 35 వైకాపాకే ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికకు ముందే ఇక్కడ జడ్పీ పీఠం వైకాపాకే దక్కడం ఖాయమైపోయింది. జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో మొత్తం ఏడు జడ్పీటీసీలు వైకాపాకే ఏకగ్రీవమయ్యాయి. ఏడు మండలాల్లోని 65 ఎంపీటీసీ స్థానాలూ వైకాపా వశమయ్యాయి. కమలాపురం నియోజకవర్గంలో 6, మైదుకూరు నియోజకవర్గంలో 5 జడ్పీటీసీ స్థానాలూ వైకాపాకే దక్కాయి. కమలాపురంలో 58 ఎంపీటీసీ స్థానాలకు 52, మైదుకూరులో 61 ఎంపీటీసీ స్థానాలకు 54చోట్ల వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే రాయచోటి నియోజకవర్గంలో ఆరు జడ్పీటీసీలూ వైకాపాకే దక్కాయి. 67 ఎంపీటీసీ స్థానాల్లో 65 వైకాపా ఖాతాలో పడ్డాయి. రాజంపేట నియోజకవర్గంలో 70 ఎంపీటీసీ స్థానాల్లో 60 చోట్ల వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం కాగా.. 3 చోట్ల తెదేపా అభ్యర్థులు ఎన్నికయ్యారు. మాచర్ల నియోజకవర్గంలో 5 జడ్పీటీసీలూ వైకాపా ఖాతాలో చేరాయి. 69 ఎంపీటీసీ స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థ్ధులే ఏకగ్రీవమయ్యారు. గురజాల నియోజకవర్గంలో 57 ఎంపీటీసీ స్థానాలకు 47 వైకాపాకే దక్కాయి. గుంటూరు జిల్లా కొల్లిపరలో జడ్పీటీసీకి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రశాంతి ఉపసంహరించుకుని వైకాపాలో చేరారు. ఇక్కడనుంచి వైకాపా తరపున జడ్పీ అధ్యక్ష స్థానం ఆశిస్తున్న కత్తెర క్రిస్టినా పోటీ చేస్తున్నారు.

ప్రకాశంలో..

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఆరు మండలాలకుగాను నాలుగుచోట్ల వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మార్కాపురం నియోజకవర్గంలోని మొత్తం 39 ఎంపీటీసీ స్థానాలకు 38 వైకాపాకే దక్కాయి. కందుకూరు నియోజకవర్గంలో 59 ఎంపీటీసీలకు 32 వైకాపాకు, యర్రగొండపాలెం నియోజకవర్గంలో 76 ఎంపీటీసీ స్థానాలకు 55 వైకాపా ఏకగ్రీవంగా గెలిచాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన 51 ఎంపీటీసీ స్థానాల్లో 29 స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు సొంత మండలమైన రేగిడిలో వైకాపా అభ్యర్థులు 11 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయనగరం జిల్లాలో మూడు జడ్పీటీసీ స్థానాల్లో ఏకగ్రీవమయ్యాయి. మెరకముడిదాంలో మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

చిత్తూరులో హవా

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలో పుంగనూరులో మొత్తం ఆరు జడ్పీటీసీ స్థానాలు, ఆరు మండలాల్లోని 64 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులే ఏకగ్రీవంగా గెలిచారు. మంత్రి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లి నియోజకవర్గంలో మొత్తం ఆరు జడ్పీటీసీ స్థానాలూ వైకాపా ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక్కడ 72 ఎంపీటీసీ స్థానాల్లో 70 చోట్ల వైకాపా అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రగిరిలో ఆరు జడ్పీటీసీలకు 5,100 ఎంపీటీ స్థానాల్లో 85 వైకాపా వశమయ్యాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీలు, 64 ఎంపీటీసీల్లో 63 చోట్ల వైకాపా అభ్యర్థులే ఏకగ్రీవమయ్యారు. ఇక్కడ ఎన్నికల్ని బహహష్కరిస్తున్నట్లు తెదేపా ప్రకటించడం గమనార్హం.

  • ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే డోన్‌ నియోజకవర్గంలో మూడు జడ్పీటీసీ స్థానాలుండగా వైకాపా అభ్యర్థులు రెండుచోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు మండలాల్లో 54 ఎంపీటీసీల్లో 47 స్థానాలను వైకాపా ఏకగ్రీవంగా గెలుచుకుంది. 5 తెదేపాకు దక్కాయి. కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని 5 జడ్పీటీసీలు, 85 ఎంపీటీసీ స్థానాల్లో 84 చోట్ల వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.
  • నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మొత్తం ఆరు జడ్పీటీసీల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇదీ చదవండి:రణరంగంలా ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.