ETV Bharat / city

'జీఎన్ రావు కమిటీ నివేదిక మాకు సమ్మతమే'

author img

By

Published : Dec 21, 2019, 7:15 AM IST

రాజధానితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను... వైకాపా నేతలు స్వాగతించారు. పాలన వికేంద్రీకరణ ఫలితంగా అన్ని ప్రాంతాలూ... సమానంగా అభివృద్ధి చెందుతాయని వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో కమిటీ ప్రస్తావించిన అంశాలపై చర్చించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

'జీఎన్ రావు కమిటీ నివేదిక మాకు సమ్మతమే'
'జీఎన్ రావు కమిటీ నివేదిక మాకు సమ్మతమే'
'జీఎన్ రావు కమిటీ నివేదిక మాకు సమ్మతమే'

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి 3 రాజధానులు సహా 4 ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేయాలని... జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అన్ని ప్రాంతాల వైకాపా నేతలు సమర్థించారు. 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేలా కమిటీ సూచనలు ఉన్నాయన్నాయని ఉత్తరాంధ్ర నేత, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో లక్ష కోట్లు పెట్టి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేయమని బొత్స పేర్కొన్నారు. కమిటీ సూచించిన ప్రకారం ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని ఉద్ఘాటించారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పారు.

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పతుందన్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై... మేధావులు నిర్వహించిన సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఇదీ చదవండీ...

జీఎన్‌ రావు కమిటీ ప్రతిపాదనలతో విభేదించిన చంద్రబాబు

Intro:Ap_Vsp_95_20_Minister_On_Vizag_Capital_Avb_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్ కు పారిశ్రామికవేత్తలు అభినందన సభ నిర్వహించారు.

Body:ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. విశాఖపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పారిశ్రామిక వ్యాపార నేతలంతా హాజరై తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు.

Conclusion:రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తూ విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, సత్యవతి, స్థానిక శాసన సభ్యులు పాల్గొన్నారు.

బైట్: ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంత్రి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.