రాజధాని నిర్మించే సత్తా వైకాపా ప్రభుత్వానికి లేదని చంద్రబాబు ట్విటర్ వేదికగా విమర్శించారు. ఆవిషయం ప్రజలు ముందు నిజాయితీ ఒప్పుకోవటం ముఖ్యమంత్రి జగన్కు చేతకాదన్నారు. రాష్ట్రం నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించామన్నారు చంద్రాబాబు.ఆ నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా జగన్ ఆరోజు స్వాగతించారని గుర్తు చేశారు. శివరామకృష్ణన్ ప్రజాభిప్రాయ సేకరణలోనూ..అమరావతే రాజధానికి అనూకూలమైన ప్రాంతంగా తేలిందన్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కమిటీ వేయడమేంటని ప్రశ్నించారు.
సిపెట్ భవనాలు ప్రారంభించటం హర్షణీయం
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో ప్లాస్టిక్ ఇంజనీరింగ్, సాంకేతిక కేంద్రీయ సంస్థ (సిపెట్) నూతన భవనం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.2016లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.
ఇదీచదవండి