"రాష్ట్రంలో అధిక, మధ్య ఆదాయ ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్ర సమయంలో ఎంతో మంది అల్పాదాయవర్గాల వారు... తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమం కావాలని జగన్ను కోరారు. ప్రజల కోరిక మేరకు సీఎం జగన్.. ఆంగ్లమాధ్యమం తీసుకొచ్చారు. ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం ఉన్న చాలా సీబీఎస్సీ పాఠశాలలో ఇప్పటికీ తెలుగు భాషలేదు. గత ప్రభుత్వంలో ఒకటి నుంచి 10వ తరగతి వరకూ తెలుగును ఒక పాఠ్యాంశంగా ఉంచాలని పోరాడాం.. కానీ ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మారుతున్న పరిస్థితుల మేరకు ఆధునీకరణ అందిపుచ్చుకునేందుకు వైకాపా ప్రభుత్వం.. ఈ జీవో తీసుకొచ్చింది. ఈ జీవోను స్వాగతిస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో ప్రతిఒక్కరూ తమ పిల్లలు ఆంగ్లభాషలో చదువుకోవాలని ఆకాంక్షిస్తున్నారు "------- యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
ఇదీ చదవండి :