ETV Bharat / city

'జగనన్న వసతి దీవెన... మరో మాయా పథకం' - yanamala ramakrishnudu news

తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన పథకాలకే సీఎం జగన్​ పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. అలాగే పెట్టుబడులపైనా వైకాపా ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని ఆరోపించారు.

yanamala rama krishanudu
yanamala rama krishanudu
author img

By

Published : Feb 24, 2020, 5:58 PM IST

జగనన్న వసతి దీవెన... మరో మాయా పథకమని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. తెదేపా గతంలోనే ప్రవేశపెట్టిన పథకాన్నే పేరుమార్చి కొత్తదానిగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కంటివెలుగు పథకం తాము తెస్తే జగన్‌ తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారన్నారు. అలాగే ఉపకార వేతనాలు పెంచింది తమ ప్రభుత్వమేనని... ఈబీసీ, కాపు విద్యార్థులకు ఎమ్​టీఎఫ్ తొలిసారిగా ప్రారంభించింది తామేనని యనమల చెప్పారు. 9 నెలల్లో 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయనడం పచ్చి మోసమని అన్నారు. కంపెనీల పేర్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు.

ఇదీ చదవండి:

వారితో యుద్ధం చేస్తున్నా.. నన్ను ఆశీర్వదించండి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.