ప్రపంచ క్యాన్సర్డే సందర్భంగా తెలంగాణలోని బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రిలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆస్పత్రి సీఈవో ప్రభాకర్ ప్రారంభించారు. క్యాన్సర్ రకాలు, కారణాలు.. నివారణ మార్గాలపై నర్సింగ్ విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ ప్రదర్శన ఈనెల ఆరో తేదీ వరకు ఉంటుందని... ఎవరైనా తిలకించవచ్చని వైద్యులు తెలిపారు. కాన్సర్‌ని తొలిదశలో గుర్తిస్తే నివారించడం సాధ్యమవుతుందని డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. ఇవాళ్టి నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.