ETV Bharat / city

నీట్‌ ర్యాంకర్ల మనోగతం - విజయవాడ

నీట్​లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ మానోగతన్ని పంచుకున్నారు. తల్లిదండ్రుల పోత్సాహంతో, వైద్యులు కావాలన్న కలతో, గ్రామీణ ప్రాంతల్లో వైద్య సేవలు అందని పరిస్థితి చూసి.. చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాము అంటున్నారు.

Sai Vaishnavi
సాయి వైష్ణవి
author img

By

Published : Sep 9, 2022, 12:21 PM IST

రైతు బిడ్డకు ఉత్తమ ర్యాంకు
‘మా నాన్న రైతు. పేరు నూని శ్రీనివాస చౌదరి, తల్లి కృష్ణవేణి. తాతయ్య చింతపల్లి కామేశ్వరరావు వైద్యులు. కొవిడ్‌ సమయంలోనూ అతను చేసిన వైద్య సేవలతో స్ఫూర్తి పొందా. వైద్య వృత్తిని చేపట్టి సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రణాళికాబద్ధంగా చదివి ర్యాంకు సాధించా. దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరాలన్నది నా కోరిక. కార్డియాలజీ వైద్య నిపుణురాలిగా సేవలందించాలని భావిస్తున్నా’. -నూని వెంకట సాయి వైష్ణవి (జాతీయ స్థాయి ర్యాంకు: 15, కాకినాడ జిల్లా, కైకవోలు)

నూని వెంకట సాయి వైష్ణవి
నూని వెంకట సాయి వైష్ణవి

కార్డియాలజిస్ట్‌ అవుతా

దిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి కార్డియాలజిస్ట్‌ కావాలన్నది నా ఆశ. చాలామంది గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి సేవ చేయాలనే ఈ రంగాన్ని ఎంపిక చేసుకున్నా. తండ్రి ఎం.నరసింహ పూతలపట్టు మండలం పోలవరం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, అమ్మ ప్రభావతి గృహిణి.’ -ఎం.హర్షిత్‌ రెడ్డి (36వ ర్యాంకు, తిరుపతి)

ఎం.హర్షిత్‌ రెడ్డి
ఎం.హర్షిత్‌ రెడ్డి

చాలా ఆనందంగా ఉంది
‘దిల్లీలోని ఎయిమ్స్‌లో సీటు సాధించాలన్న లక్ష్యంతో చదివా. నీట్‌లో మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. వైద్యురాలిగా రాణించాలన్నదే నా లక్ష్యం. నా తండ్రి పేరు సుదర్శన్‌రెడ్డి. ఆర్టీపీపీలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి శ్రీవాణి.. వైద్యురాలు.’ -చప్పిడి లక్ష్మీచరిత(ర్యాంకు: 37, ప్రొద్దుటూరు)

చప్పిడి లక్ష్మీచరిత
చప్పిడి లక్ష్మీచరిత

అమ్మమ్మ మృతితో కలతచెంది వైద్య రంగాన్ని ఎంచుకున్నా
‘నా చిన్నప్పుడు గ్రామంలో వైద్యసేవలు అందక అమ్మమ్మ మరణించింది. అప్పుడే తాను డాక్టరు చదివి గ్రామీణప్రాంత వాసులకు, పేదలకు సేవలు అందించాలని నిర్ణయించుకున్నా. విజయవాడలో శిక్షణ పొందా. రోజుకు 16 గంటల పాటు కష్టపడి చదివా. తండ్రి సోమయ్య పురపాలకసంఘంలో ఉద్యోగి.’ -చందాల యశస్వినిశ్రీ(ర్యాంకు:52, కోదాడ)

చందాల యశస్విని
చందాల యశస్విని

రోజుకు 16 గంటలు చదివా
‘డాక్టర్‌ కావాలన్నది నా లక్ష్యం. రోజుకు 16 గంటల పాటు కష్టపడి చదివా. సబ్జెక్టుల్లో ఉన్న సందేహాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకొని లక్ష్యాన్ని చేరుకున్నా. తండ్రి రామకృష్ణారెడ్డి వైద్యుడు, తల్లి సౌభాగ్య.’ -వి.సేవితలాస్య, (ర్యాంకు-56, ఒంగోలు)

సేవితలాస్య
సేవితలాస్య

న్యూరో సర్జన్‌ కావాలన్నది లక్ష్యం
‘రోజుకు 16 గంటల పాటు చదివి ర్యాంకు సాధించా. న్యూరో సర్జన్‌ కావాలన్నది నా లక్ష్యం. తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు. నీట్‌ ర్యాంక్‌ సాధించేందుకు హైదరాబాద్‌లో కొంతకాలం శిక్షణ పొందా. తెలంగాణ ఎంసెట్‌లో 16, ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌లో 36వ ర్యాంకులు సాధించా.’ - వంశీధర్‌రెడ్డి(ర్యాంకు:62, నంద్యాల)

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16322736_vamshidar-reddy.jpg
వంశీధర్‌రెడ్డి

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే

‘ఇంటర్‌ మొదటి ఏడాది నుంచే నీట్‌లో ర్యాంకు లక్ష్యంగా కష్టపడి చదివా. నైపుణ్యాలు పెంచుకొని సబ్జెక్టులపై పట్టు సాధించా. తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. తండ్రి విజయ్‌భాస్కర్‌ ఉపాధ్యాయుడు.’ - శ్రీహిత సుమాంజలి, (ర్యాంకు:130, అనంతపురం జిల్లా కదిరి)

శ్రీహిత సుమాంజలి
శ్రీహిత సుమాంజలి

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివా

‘అధ్యాపకుల గైడెన్స్‌, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సగటున రోజుకు 14 గంటలు చదివా. జాతీయస్థాయిలో టాప్‌-10లో స్థానం దక్కకపోవడం నిరాశను కలిగిస్తోంది. అమ్మ శ్రీవిద్య, నాన్న ప్రసాద్‌ ఇద్దరూ వైద్యులే. వారిని స్ఫూర్తితో ముందుకు సాగుతున్నా. తెలంగాణ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు తెచ్చుకున్నా. కళాశాలలో ఇచ్చిన మెటీరియల్‌, అకాడమీ బుక్స్‌, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు బాగా చదివా’. -జూటూరి నేహ (ర్యాంకు:134, తెనాలి)

జూటూరి నేహ
జూటూరి నేహ

వైద్య వృత్తి నా కల
‘వైద్యుడు కావాలన్నది నా కల. ప్రణాళికతో చదివి ర్యాంకు సాధించా. నా తండ్రి మట్టా పరాత్పరరావు వెంకటరామన్నగూడెం వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌. తల్లి నాగాంబింక ఓ ప్రైవేటు కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. సోదరుడు వేద సంహింత్‌ వైద్య విద్యార్థి.’ -దుర్గసాయి కీర్తితేజ (ర్యాంకు 12, లక్కవరం, ఏలూరు జిల్లా)

దుర్గసాయి కీర్తితేజ
దుర్గసాయి కీర్తితేజ

న్యూరాలజిస్టుగా సేవలందించటమే లక్ష్యం

‘కళాశాలలో ఇచ్చిన అంశాలను క్రమం తప్పకుండా చదవటం, పరీక్షలు రాయటం ద్వారా సబ్జెక్టులపై పట్టు సాధించా. న్యూరాలజిస్టుగా పేదలకు సేవలందించటమే నా లక్ష్యం. తండ్రి పేరు వెంకటసుబ్బయ్య, చిన్ననాటి నుంచి చదువులో ప్రోత్సహించారు.’ -పి.సుజిత్‌చౌదరి(ర్యాంకు:185, కడప)

పి.సుజిత్‌చౌదరి
పి.సుజిత్‌చౌదరి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.