
కొవిడ్ చికిత్స కోసం ఈ నెల 14న తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకాయమ్మ భర్త చేరారు. మెరుగైన వైద్య సదుపాయం నిమిత్తం 16 రాత్రి జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌కు వచ్చిన తర్వాత వెంకాయమ్మ భర్త కనిపించ లేదు. 12 రోజుల నుంచి భర్త ఆచూకీ కోసం వెంకాయమ్మ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. ఆసుపత్రిలో ఎన్ని వార్డులు తిరిగినా... ఎంత మందిని అడిగినా సమాధానం చెప్పేవారు లేరు. జీజీహెచ్ అధికారులను అడిగినా ఫలితం లేకుండాపోయింది. చివరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని వెంకాయమ్మ ఆశ్రయించింది.
ఇదీ చదవండి