ETV Bharat / city

హంద్రీనీవా వెడల్పు పనుల్లో కొత్త అంకం! - latest updates of handri neeva sujala sravanthi project news

హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నిర్మాణ పనుల్లో కొత్త అంకం మొదలుకానుంది. నిర్మాణ పనులు ఎప్పుడో ప్రారంభమైనా..ఇప్పటికీ మొదటి దశ ప్రయోజనమూ నెరవేరలేదు. అశించిన మేర ప్రవాహ సామర్థ్యం లేకపోవడంతో..రెండేళ్ల కిందట కాలువ వెడల్పు పనులు చేపట్టినా అనుకున్నది జరగలేదు. ఇప్పుడు ఈ కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచేందుకు వీలుగా వెడల్పు పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలో పాలనామోద ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

widening capacity increase of handri neeva sujala sravanthi project

author img

By

Published : Feb 15, 2020, 9:16 AM IST

హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నిర్మాణ పనులు ఎప్పుడో ఏళ్ల కిందటే ప్రారంభమైనా ఇప్పటికీ తొలి దశ ప్రయోజనమూ నెరవేరలేదు. ఆశించిన మేర కాలువల్లో ప్రవాహ సామర్థ్యం లేకపోవడంతో.. రెండేళ్ల కిందట కాలువల వెడల్పు పనులు చేపట్టినా అనుకున్నది జరగలేదు. ఇప్పుడు ఈ కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచేందుకు వీలుగా వెడల్పు పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. శ్రీశైలంలోని వరద జలాలను మల్యాల పంపింగ్‌ స్కీం నుంచి 13 దశల్లో ఎత్తిపోస్తూ వివిధ జలాశయాల్లో నింపుతూ ఆయకట్టుకు అందించేందుకు పథకాన్ని తీర్చిదిద్దారు. దాదాపు 565 కిలోమీటర్ల మేర కాలువ ప్రవహిస్తూ కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని 6,02,500 లక్షల ఎకరాలకు నీరు అందించాలనేది లక్ష్యం.

3,880 క్యూసెక్కుల లక్ష్యం
హంద్రీనీవా ప్రధాన కాలువలో రోజుకు 3,880 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం మేరకు కాలువలను నిర్మించారు. నీటిని ఎత్తిపోసి కాలువల ద్వారా పంపడం ప్రారంభించిన తర్వాత ఆ లక్ష్యం చేరలేదన్న విషయం జలవనరుల శాఖ గుర్తించింది. కాలువ లైనింగు లేకపోవడం వల్లే సమస్య ఏర్పడిందని ఇంజినీరింగు అధికారులు పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రవాహ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా ఏం చేయాలో సూచించాలంటూ గత ప్రభుత్వ హయాంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. లైనింగ్‌ లేకుండానే కాలువ వెడల్పు పనులు ప్రతిపాదించారు. పైగా కాలువ వరకు వెడల్పు చేస్తూ కట్టడాల్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని నాడు నిపుణులు సూచించిన మేరకు రూ.1030 కోట్ల అంచనా వ్యయంతో హంద్రీనీవా తొలిదశలో కాలువ వెడల్పుకు ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది.

ఆ పనులూ పూర్తి కాలేదు!

2017లో హంద్రీనీవా తొలిదశ వెడల్పు పనులకు పాలానామోదం ఇచ్చి టెండర్లు పిలిచినా ఇప్పటికీ ఆ పనులు పూర్తికాలేదు. ఇందులో ముచ్చుమర్రి నుంచి మల్యాల వరకు 17.7కిలోమీటర్ల వరకు రూ.29.12కోట్ల అంచనాతో చేపట్టిన పనులు 50శాతమే పూర్తయ్యాయి. 78.670 కి.మీ వరకు కాలువ వెడల్పు పనులు రూ.343.35కోట్ల అంచనా వ్యయంతో చేపట్టినా పనులు 65శాతమే జరిగాయి. తర్వాత మూడో ప్యాకేజీలో రూ.234.09కోట్ల అంచనాతో చేపట్టగా 35శాతమే పనులు అయ్యాయి. 216వ కిలోమీటరు వరకు నాలుగో ప్యాకేజీలో రూ.292.612కోట్ల అంచనాతో చేపట్టగా పనులు 40శాతమే పూర్తయ్యాయి. ఇంతలో ప్రభుత్వం మారింది. విజిలెన్సు ఈ పనులపై దృష్టి సారించింది.

హంద్రీనీవా కాలువ వెడల్పు ప్రణాళికలో మళ్లీ తాజాగా మార్పులు చేస్తున్నారు. తొలిదశలో 6300 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లేందుకు అనువుగా కాలువను వెడల్పు చేయాలని, ఆ మేరకు కట్టడాల నిర్మాణాల్లోనూ మార్పులు చేయాలని, పంపుహౌస్‌ సామర్థ్యాన్ని పెంచాలని జలవనరులశాఖ ప్రతిపాదిస్తోంది. రూ.6310 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టేందుకు జలవనరులశాఖ పరిశీలిస్తోంది. త్వరలో పాలనామోద ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి : హోంమంత్రి అమిత్​షాతో సీఎం జగన్​ చర్చించిన అంశాలివే..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.