విజయవాడలోని కార్యాలయంలో ఎస్‌ఈసీ అధికారులను వైకాపా నేతలు కలిశారు. తెదేపా నేతల వైఖరిపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల ఘటనలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశామని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నామినేషన్లలో పలుచోట్ల తెదేపా దౌర్జన్యం చేసిందని మల్లాది విష్ణు ఆరోపించారు. ఎన్నికల ముగిసేవరకు అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెదేపా మేనిఫెస్టోపై ఎస్‌ఈసీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండీ... ఏకగ్రీవాలపై వైకాపా ఆశలు నీరుగారాయి: చంద్రబాబు