జగన్ రెడ్డి నీతిమంతుడైతే 40 డిశ్చార్జి పిటిషన్లు ఎందుకు వేశారు.? విచారణ తప్పించుకుని తిరుగుతున్న నేతలు చంద్రబాబుని విమర్శించటం విడ్డూరంగా ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డిది అక్రమ కేసని స్ట్రింగ్ ఆపరేషన్లో తేలిపోయింది. చంద్రబాబుపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని రుజువు కావటంతో వైకాపా దొంగలంతా అడ్డంగా బుక్కయ్యారు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని కోర్టులు తేల్చాయి. రూ.43వేల కోట్ల దోపిడీలో ఆధారాలున్నాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి 16నెలలు జైల్లో ఉన్నారు. బెయిల్పై వచ్చి ముఖ్యమంత్రిహోదాను అడ్డంపెట్టుకుని విచారణకు హాజరుకాకుండా కేసులను సాగదీస్తున్నారు. అభివృద్ధిని నాశనం చేస్తూ అబద్ధాలతో ఇంకెంతకాలం ప్రజల్ని మోసగిస్తారు..? జీవో నెంబర్ 41ద్వారా ఎస్సీలకు చంద్రబాబు భూముల రిజిస్ట్రేషన్ హక్కు కల్పించి లబ్ధి చేకూర్చారు. జీవో నెంబర్ 72తో జగన్మోహన్ రెడ్డి విశాఖలో 2552 ఎకరాలు బలవంతంగా లాక్కుని దళిత ద్రోహిగా మిగిలారు.-నక్కా ఆనంద్ బాబు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు
ఇదీ చదవండీ... రాష్ట్రాలకు దన్ను: 15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు