ధైర్యం ఉంటే అరెస్టు చేయమన్న తెదేపా నేతలు.. ఆధారాలతో సహా ఏసీబీ అరెస్టు చేస్తుంటే విమర్శలు చేయడం ఏమిటని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల సొమ్ము తిన్నవారిని చంద్రబాబు నాయుడు వెనకేసుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమాల్లో చంద్రబాబుకు తనను ఎప్పుడు పట్టుకుంటారోనన్న భయం వెంటాడుతోందని ధ్వజమెత్తారు. తుక్కు కొనుగోలు చేసి, బస్సులుగా మార్చి దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నందున జేసీ ట్రావెల్స్ యజమానులు అరెస్టయ్యారని పేర్కొన్నారు. చట్టపరంగా పోలీసులు అరెస్టు చేస్తే కిడ్నాప్ అనటం ఏమిటని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని అంశాల్లోనూ ఆర్ధిక అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
ఇదీచదవండి.